తెలంగాణ

10 నుంచి పాసుపుస్తకాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 26: రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీ నుండి పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఎవరి పేరు మీద ఉంటుందో వారికే నేరుగా పంట పెట్టుబడి చెక్కులు అందజేస్తామని ఆయన స్పష్టం చేసారు. సంబంధిత పట్టాదారు అనారోగ్య కారణాల చేత రాలేకపోతే అధికారులే నేరుగా ఇంటికి వెళ్లి అందజేస్తారని తెలిపారు. రైతును రాజు చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మందుకు పోతోందని అన్నారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో రైతుబంధు పథకంపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల మండల రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవరి ఆలోచనలకూ తట్టని విధంగా రైతు బంధు అనే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మే 10నుండి 17 వరకు నిర్వహించే పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంపై స్ధానిక ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతుందరినీ భాగస్వాములను చేస్తూ మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తెలంగాణలో 2 కోట్ల 40 లక్షల ఎకరాల భూమి ఉం దని ఇందులో కోటి 43లక్షల వ్యవసాయ భూమిని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం 72 లక్షల మంది రైతులు ఖాస్తులో ఉన్నారని అన్నారు.
కోటి 43 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో కోటి 27 లక్షల ఎకరాల ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయని ఇటీవల నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళనలో నిర్ధారించినట్టు చెప్పారు. ఈ మేరకు 60 లక్షల మంది రైతులకు మొదటి విడతలో మేలో పంట పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మిగిలిన 16లక్షల ఎకరాలకు సైతం సమస్యలను పరిష్కరించి రికార్డులను సరిచేసి ఖాతాలు క్లియర్‌గా ఉంటే అందరికీ పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేటగిరి ఎ కింద ఉన్న రైతులకు మొదట విడతలో పంట పెట్టబడి ఇస్తున్నామని, క్యాటగిరి బి కింద ఉన్న వాటిని పరిష్కరిస్తే వారికి కూడా పెట్టుబడి అందజేస్తామని అన్నారు. సమస్య ఉన్న వాటిని పరిష్కరించి అందిరికీ పెట్టుబడి ఇచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. పంట పెట్టబడికి 12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐతో మాట్లాడి మొదటి విడత 6000 కోట్లను నగదు రూపంలో ఆయా బ్యాంకులలో అందుబాటులో పెట్టినట్టు చెప్పారు. రైతులు చెక్కులు ఇచ్చిన బ్యాంకులలో నగదు చెల్లించేలా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు. పాస్ పుస్తకాలు చెక్కుల పంపిణీలో ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితులను సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంపై రైతు సమన్వయ సమితులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామస్థాయి లో పంపిణీ సమయంలో ఆయా గ్రామాల రైతులందరూ వచ్చి చెక్కులు తీసుకెళ్లేలా సభ్యులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రైతు సమన్వయ సమితుల సభ్యులకు ఇదొక మంచి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సమితి సభ్యులు గ్రామంలో సమన్వయంతో సక్రమంగా పంపిణీ చేసే విధంగా చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని కడియం శ్రీహరి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పద్మ, స్టేషన్‌ఘనపూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య, పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, హుస్నాబాద్ శాసనసభ్యుడు సతీష్‌బాబు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, జాయింట్ కలెక్టర్ దయానంద్. వ్యవసాయ అధికారి ఉషాదయాల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.