తెలంగాణ

రిజర్వేషన్ల కోసం బీసీల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకునేందుకు రాష్ట్రాస్థాయిలో ఉద్యమించాలని బీసీ సంఘాలు తీర్మానించాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలో రాష్టస్థ్రాయి బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమాశం జరిగింది. సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 112 కుల సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా బీసీలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాబాలో సగానికి పైగా ఉన్న కులాలు రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను సైతం వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని వాపోయారు. ఇక త్వరలో నిర్వహించనున్న పంచాయతి ఎన్నికల్లో సైతం బీసీలకు మోసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2014 జనాబా లెక్కల ప్రకారం... బీసీల జనాబా ఎంత ఉందో ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. మొత్తం గ్రామ పంచాయతిలను యూనిట్‌గా తీసుకొని బీసీలకు 55 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ పంచాయతిలను తొలగించి మిగిలిన వాటిలో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామనడం సరికాదని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 112 కుల సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేసి గ్రామ, మండల, జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానిలో దశల వారీగా ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో కొనసాగుతున్న బీసీ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన బీసీ ప్రతినిధులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తీర్మానించారు.