తెలంగాణ

దళితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: దళితుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని ఎస్‌సి సంక్షేమ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌సి కార్పోరేషన్, అపోలో ఆసుపత్రులు సంయుక్తంగా నిర్వహించిన వృత్తినైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం ఆయన సర్ట్ఫికెట్లను అందచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృత్తివిద్యా నైపుణ్యకోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు. దళితుల సంక్షేమం కోసం నిధులు ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అపోలో ఆసుపత్రులతో పాటు జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (ఎన్‌ఐటీహెచ్‌ఎం), కెల్ట్రాన్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్‌ఎస్‌ఐసీ), సెట్విన్, మహిళా ప్రాంగణం, ఆర్‌టీసీ, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (నిమ్స్‌మే) తదితర సంస్థలతో కలిసి ఎస్‌సి కార్పోరేషన్ ఉపాధి కోసం శిక్షణ ఇస్తున్నాయని వివరించారు.
ఎస్‌సి కార్పోరేషన్‌తో కలిసి పనిచేస్తున్న అపోలో సంస్థను మంత్రి జగదీష్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంల ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్‌సీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం బుక్యా, ఎస్‌సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనందకుమార్, అపోలో ఆసుపత్రి సీఈ పులాచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.