తెలంగాణ

‘దోస్త్’ ఆప్షన్లలో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ‘దోస్త్’ లో గందరగోళంపై ఆంధ్రభూమి వార్తకు అధికారులు స్పందించారు. తొలి దశలో సీట్లు పొందిన వారు, రెండో దశలో సీట్లు పొందిన వారికి సైతం మూడో దశలో సీట్లకు దరఖాస్తు చేసుకునే వీలుకల్పించారు. తొలి దశలో తొలి ఆప్షన్‌లో సీట్లు పొందిన వారికి మలి దశలో అవకాశం కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పాటు వేలాది మంది విద్యార్థులు దోస్త్ కార్యాలయానికి తరలిరావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దోస్త్‌లో ఇంత వరకూ జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,17,338 కాగా మూడో విడతలో రిజిస్ట్రేషన్లు 18,323 ఉన్నాయి.
వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారు 1,98,139 మంది కాగా, 1,51,673 మందికి సీట్లు కేటాయించామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి , అడ్మిషన్స్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇందులో 1,14,910 మంది తమ అడ్మిషన్లను కన్ఫర్మ్ చేసుకున్నారని, అయితే కన్ఫర్మ్ చేసుకున్న వారికి సైతం మూడో దశ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన లాగిన్ ఐడి, పాస్‌వర్టుల కోసం సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లాలని వారు సూచించారు.
అభ్యర్ధి వివరాలను పరిశీలించిన మీదట, వారిచ్చిన సెల్ నెంబర్‌కు యూజర్ ఐడి, పాస్‌వర్టులను పంపిస్తారని, వాటిని వినియోగించుకుని తాజాగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పారు. తొలి దశలో, రెండో దశలో సీటు పొందని వారు కూడా మూడో దశలో వెబ్ ఆప్షన్ల ఇవ్వవచ్చని చెప్పారు. ఈ నెల 27లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, అలాగే వెబ్ ఆప్షన్లను సైతం నమోదుచేసుకోవాలని అన్నారు. దోస్త్ కౌనె్సలింగ్ నుండి బయటకు వెళ్లాలనుకునే వారు తమ టీసీలను తిరిగి పొందవచ్చని, అందుకు సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 74 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, అభ్యర్ధులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. వెయ్యి రూపాయిలు లేదా ఐదు వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకున్న అభ్యర్ధులు దోస్త్ వెబ్ పోర్టల్‌లో స్టూడెంట్ లాగిన్‌లోకి వెళ్లి బ్యాంకు డిటైల్స్ ఇస్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వారు చెప్పారు.
ఈసెట్ ప్రాసెస్ ప్రారంభం
ఇసెట్ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్ధులు 24వ తేదీ నుండి 26వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. 25 నుండి 27 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తయిన వారు 25 నుండి 28లోగా వెబ్ ఆప్షన్లను నమోదుచేయాలి. 30వ తేదీన తుది అలాట్ మెంట్ జరుగుతుందని కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు.