తెలంగాణ

ఇక సమగ్ర ఫింగర్ ప్రింట్ డాటా బేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో నేరాల నిరోధానికి, నేరస్తుల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సమగ్ర ఫింగర్ ప్రింట్ డేటా బేస్‌ను రూపొందించేందుకు కసరత్తు చేపడుతోంది. వేలిముద్రల ఆధారంగా నేరస్తుల గుర్తింపు, నిర్ధారణ పక్కా శాస్ర్తియ ఆధారంగా ఎంతో ఉపయోగంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స్ధాయి ఫింగర్ ప్రింట్ బ్యూరోను మరింత విస్తత్రం చేసేందుకు సన్నద్దం అవుతోంది. ఇప్పటికే కొంత డేటా బేస్ సమకూర్చుకున్న పోలీస్ శాఖ సామర్ధ్యాన్ని మరింత విస్తత్రం చేసేందుకు నిర్ణయించింది. నేరంతో సంబంధం ఉన్న అనుమానితులను స్టేషన్‌కు తీసుకురాకుండానే సిబ్బంది తమ వద్ద ఉన్న ప్రత్యేక మొబైల్ పరికరం ద్వారా వారి వేలి ముద్రలు తీసుకుని, సంఘటనలో లభించిన వేలిముద్రలతో పోల్చి చూడ్డంతో నిందితుడు సులభంగా నిర్ధారణ అవుతున్నాడు. ఈ ప్రక్రియలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక ఫింగర్ ప్రింట్ ట్యాబ్‌ను ఇప్పటికే అందజేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వరకు తీసుకు వచ్చి విచారించే అవకాశం లేదు. దీంతో చాలా మంది అనుమానితులను విచారణకు తీసుకురావడం తగ్గిపోయింది. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాల్లో వేలిముద్రలు ఒకటి. ఈ కోణంలో దర్యాప్తు చేసేందుకు వేలిముద్రల నిపుణులను వినియోగిస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరో దేశంలోనే తొలిసారిగా ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎఎఫ్‌ఐఎస్) ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. దీని ఆధారంగా ఒక్క నేరస్తులే కాకుండా విదేశీ ఇమ్మిగ్రేషన్ అవసరానికి కూడా వేలిముద్రల తనిఖీకి వినియోగిస్తున్నారు. ఆధార్ వేలిముద్రల డేటాను సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి ఇవ్వాలని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఆ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఒక వేళ అంగీకరిస్తే చాలా ఉపయోగపడుతోందని భావిస్తోంది. కాగా తెలంగాణ పోలీసు శాఖ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారు, జైళ్ల నుంచి బయటకు వచ్చిన వారు, పాత నేరస్తులు, కొత్తగా నేరం చేసి వస్తున్న వారి వేలిముద్రలను సేకరించి భద్రపర్చడం కోసం పెద్ద ఎత్తున ఆ విభాగాన్ని విస్తత్రం చేస్తోంది. ఇలా సేకరించిన డేటాను కేంద్ర ఫింగర్ ప్రింట్ బ్యూరోకు అనుసంధానం చేస్తారు. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది నేరస్తుల వేలిముద్రలతో సమగ్ర డేటా బేస్ తయారు రూపొందించేందుకు సెంట్రల్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నా, చాలా రాష్ట్రాల నుంచి సమాచారం రావడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేసిన ఆధునాతన ఎఎఫ్‌ఐఎస్ వల్ల 868 కేసులు పరిష్కారం కాగా, వాటిలో 480 పాతకేసులు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల చేతిలో ఉన్న మొబైల్ పరికరంతో ఏడు వేల మంది నేరస్తుల వేలిముద్రలు, వారి నేర చరిత్రను డేటా బేస్‌లో నమోదు చేశారు. మాన్యువల్ పద్దతికి స్వస్తి చెప్పి ఇలా ఆన్‌లైన్ ద్వారా వేలిముద్రలు తీసుకోవడం, సంఘటన ప్రాంతంలో దొరికిన వాటితో సరిపోల్చుకునేందుకు మొబైల్ పరికరాన్ని వినియోగిస్తున్నారు. నేరస్తులు ఒక చోట నేరం చేసి మరో చోట దాగి ఉండడం, లేదా పరారవుతుంటారు. వారి కదలికపై కనే్నసి ఉంచడంతో పాటు వాటి వివరాలను ఆయా రాష్ట్రాల ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపిస్తే అక్కడే వారిని అరెస్టు చేసేందుకు వీలుంటుంది. దీనికి తోడు ప్రతి ఏటా 80 నుంచి 85 శాతం మంది కొత్త నేరస్తులు రావడంతో వారి డేటా బేస్ లభించడం లేదని పోలీసు శాఖ భావిస్తోంది. ఇక నుంచి దొరికిన ప్రతి నేరస్తుడి డేటా సేకరించడం వల్ల ఇంకా సమాచారం ఎక్కువగా ఉంటుందని యోచించి తెలంగాణలో ఫింగర్ ప్రింట్ బ్యూరోను పటిష్టం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా 50 లక్షల కేసుల వరకు నమోదు అవుతుంటే, వీటన్నింటిలో కీలకమైన కేసుల్లో నేరస్తుల నిర్ధారణ కష్టమవుతోంది. ఇందుకు రాష్ట్రాల బ్యూరోలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తమ డేటా బేస్ పెంచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని తాజాగా జరిగిన ఫింగర్ ప్రింట్ బ్యూరోల సమావేశంలో నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే.