తెలంగాణ

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం బస్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 26: తెలంగాణలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ధాన్యం పోటెత్తింది. గురువారం రికార్డు స్థాయిలో 80వేల బస్తాలకు మించి ధాన్యం తరలివచ్చింది. దీంతో మార్కెట్ ప్రాంగణమంతా ధాన్యం రాశులతో నిండిపోయింది. రబీ కోతలు ముమ్మరం కావడంతో గత 15 రోజులుగా మార్కెట్‌కు భారీగా ధాన్యం వస్తోంది. ఎండల తీవ్రత అధికమవుతుండటంతో కొనుగోళ్లు జరిగినా కాంటాలు వేయడంలో జ్యాప్యం జరుగుతుండటంతో ఇబ్బందులను అధిగమించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రోజుకు 35 నుండి 45వేల బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కాగా టోకెన్ విధానం అమలు ద్వారా రైతులు ఇబ్బందులకు గురికావడంతో పాటు అక్రమాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో టోకెన్ విధానాన్ని రద్దుచేయాలని జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ధాన్యాన్ని తీసుకురావడంతో యార్డంతా ధాన్యం రాశులతో నిండిపోయింది. మార్కెట్‌లోని షెడ్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ స్థలం దొరికినా రైతులు ధాన్యం రాశులు పోసి అమ్మకానికి పెట్టారు. 80వేల బస్తాల పైచిలుకు ధాన్యం వచ్చినట్టు అధికారులు అంచనావేశారు. ఒకేసారి ధాన్యం భారీగా రావడంతో మార్కెట్‌లో కాలు మెదిపే స్థలంలేక రైతులు, మార్కెట్ అధికారులు, వ్యాపారులు, హామాలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకేసారి ధాన్యం భారీగా రావడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించారు. దొడ్డురకం ధాన్యాన్ని మొన్నటి వరకు రూ.1400 నుండి 1550 వరకు కొనుగోలు చేయగా తేమ పేరుతో గురువారం రూ.1100 నుండి 1250 మధ్యే అధికంగా ధరలు వేయడంతో అన్నదాతలు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించి ధరల తగ్గుదలపై అధికారులు, సిబ్బందిని నిలదీశారు. స్పందన లేకపోవడంతో ఆగ్రహంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యానంతా కొనుగోలు చేసినప్పటికీ సందట్లో సడేమియా అన్నట్టుగా పెంచిన హమాలీ చార్జీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హమాలీలు మెరుపుసమ్మెకు దిగారు. సమ్మెకారణంగా కాంటాలు నిలిచిపోవడంతో హుటాహుటిన అధికారులు హమాలీల సంఘం నేతలతో చర్చలు జరిపారు.