తెలంగాణ

జాతీయ హోదా ఎందుకు కోరట్లేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎందుకు భయపడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి ఇ. పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన వర్క్ షాప్ జరిగింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి చర్చించారు. సమావేశానంతరం ఇ.పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ హోదా సాధిస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆయన చెప్పారు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తాము పోరాటం చేస్తామని తెలిపారు.