తెలంగాణ

తిరుమల కాలిబాటలో అస్వస్థతకు గురైన మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 11: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలనడకన బయలు దేరి మార్గమధ్యలో గాలి గోపురం వద్ద అస్వస్థతకు గురైయ్యారు. బీపీ తగ్గడంతో కింద పడిపోయిన ఆయన కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని తిరుమలకు చేరుకున్నారు. కాని అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుపతిలోని బాలాజీ కాలనీలోని జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అనంతరం టౌన్‌క్లబ్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి, ఎస్వీ మెడికల్ కళాశాల వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలల వేసి అంజలి ఘటించారు. అక్కడ నుంచి అలిపిరి వద్దకు చేరకుని పాదాల మండపంలో పూజలు చేసి శ్రీవారి దర్శనార్థం కాలినడక తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గాలిగోపురం వద్దకు చేరుకునే సరికే పూర్తిగా అలసిపోయిన మోత్కుపల్లి నరసింహులకు ఒక్కసారిగా బీపీ తగ్గడంతో తూలి కింద పడ్డారు. గాలి గోపురం వద్ద ఉన్న వైద్యులు ఆయన్ను పరిశీలించి బీపీ తగ్గిన విషయాన్ని తెలిపారు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న మోత్కుపల్లి తిరుమలకు నడిచి వెళ్లడానికి సిద్ధమైయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేకున్నా తన సంకల్పాన్ని విడవకుండా తిరుమలకు చేరుకున్నారు. దాదాపు 6 గంటల పాటు ఆయన నడిచి తిరుమలకు చేరారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయన నేరుగా అశ్విని ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు.

ఏ పార్టీలో చేరను.. బాబును ఓడించడమే లక్ష్యం
ఇదిలావుండగా మోత్కుపల్లి నరసింహులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని, అవమానాన్ని భరించలేకపోతున్నాను.. కాలి బాటలోని మెట్లపై నాప్రాణాలు పోయినా బాగుండేది అని ఆవేదనతో అన్నారు.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను అవమాన పరిచాడని, ప్రజల ముందు అవహేళన చేశాడని ఆయన ఆరోపించారు. దళితులకు సేవ చేయడం తప్ప తనకింకేమి తెలియదని, వేరో ఆలోచన కూడా తనకు లేదన్నారు. అయితే బాబు తనను కులం పేరుతో దూషించాడని ఈ సందర్భంగా మోత్కుపల్లి ఆరోపించారు. తనకు జీవితం మీద విరక్తికలిగిందని చెప్పారు. తనకు ఎన్‌టి రామారావు రాజకీయ భిక్ష పెట్టారని దానిని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డానన్నారు. చంద్రబాబు నాయుడు తనను చాలా అవమానాలకు గురిచేశారని 10 కోట్లమంది ప్రజల ముందు అనామకుని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు ప్రజలు తనను గౌరవించి ఆరుసార్లు ఎమ్మెల్యేని చేశారని, రాజకీయ నాయకుడిగా నీతి, నిజాయితీగా వ్యవహరించానన్నారు. తాను అంబేద్కర్, ఎన్ టి ఆర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్నాని వివరించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను దళితుడన్న ఒకే కారణంతో అవమానించి, రాజకీయంగా తన గొంతు కోశాడని ఆరోపించారు. తాను చేయని పాపానికి బలిపశువునైయ్యానని, తన నిజాయితీ, సీనియారిటీ పనికిరావడం లేదని వాపోయారు. అగ్రకులాల పట్ల ఒక తీరుగా, అణగారిన వర్గాల పట్ల ఒక తీరుగా ప్రవర్తిస్తున్నారని మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నో తప్పులు చేసిన రేవంత్ రెడ్డిని ఒక్కమాట కూడా అనని చంద్రబాబు నాయుడు తనను పార్టీనుంచి బహిష్కరించారని, తనను పార్టీ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో బాబు సమాధానం చెప్పాలన్నారు. తన మనస్సు తీవ్రంగా గాయపడిందన్న ఆయన ఈవిషయం శ్రీవారికి చెప్పుకోవడానికే తిరుమలకు వచ్చానన్నారు. తనకు బతకాలని లేదని, రాజకీయం చేయాలని కూడా లేదంటూ వ్యాఖ్యానించారు. బాబు చేసిన దగాను దేవునికి తెలియజేయడానికే తిరుమలకు కాలిబాటన వచ్చానన్నారు. తన ఆరోగ్యం, శరీరం సహకరించకపోయినా రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోవాలని మొక్కుకునే తాను నడుచుకుంటు వచ్చానని అన్నారు. బీపీ తగ్గి, గుండె నొప్పి వచ్చినా పాదయాత్ర మాత్రం ఆపలేదన్నారు. 3558 మెట్లు ఎక్కేశక్తిని ఆ భగవంతుడే తనకు ప్రసాదించాడని ఆయన చెప్పారు. అంతకుముందు అలిపిరి వద్ద మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ చంద్రబాబు నమ్మద్రోహి, మోసగాడు, దుర్మార్గుడు, గజదొంగ అంటూ విమర్శించారు. టీడీపీపై విమర్శలు చేస్తే తనను చంపాలని చూశారన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రూ. 100కోట్లకు బాబు అమ్ముకున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుకి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఆయన మానసిక క్షోభకు గురై కన్నుమూశాడన్నారు. చంద్రబాబును ఓడించేందుకు జనసేన, వైకాపా, వామపక్షాలు, దళిత సంఘాలన్నీ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.