తెలంగాణ

నవాజ్ జంగ్ గొప్ప ఇంజనీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: అలీ నవాజ్ జంగ్ అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు డిజైన్ చేసిన రూపకర్త అని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు కొనియాడారు. నిజాం సాగర్ వంటి అద్భుతమైన ప్రాజెక్టుకు డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించిన ప్రాజెక్టుల స్ఫూర్తితో ప్రాజెక్టులు నిర్మిస్తున్నమన్నారు. నవాజ్ జంగ్ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాలనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆయన జన్మదినాన్ని ‘ఇంజనీర్స్ డే’గా నిర్వహించుకుంటున్నామని మంత్రి గుర్తు చేసారు. జలసౌధలో బుధవారం నవాజ్ జంగ్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రం నవాజ్ జంగ్‌ను విస్మరించిందన్నారు. నిజాం సాగర్ నిర్మించిన సమయంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ గుర్రాలపై వెళ్లి ప్రాజెక్టు వద్ద టెంట్లు వేసుకుని ఉన్నారని గుర్తు చేసారు. ఎన్నో ప్రాజెక్టులకు డిజైన్ చేసిన మోక్షగుండం విశే్వశ్వరయ్యకు సాటిగా నవాజ్ జంగ్ పేరు ప్రఖ్యాతలు సంపాయించారన్నారు.
నవాజ్ జంగ్ బహదూర్ స్ఫూర్తితో నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు అహర్నిశలు కష్టపడుతూ బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతున్నారని మంత్రి అభినందించారు. నీటిపారుదలశాఖ ఇంజనీర్లు డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కేంద్ర జల సంఘం ఇంజనీర్లు సైతం అబ్బురపడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో మహిళా ఇంజనీర్లు సైతం రాత్రింబవుళ్లు కష్టపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా మహిళా ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి కొనియాడారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజిల వద్ద ఉండే ఇంజనీర్లు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టిఎంసికి ఆరు వేల ఎకరాలకు నీరు అందడం గగనంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో టిఎంసితో 13 వేల ఎకరాలు సాగు అవుతున్నాయన్నారు. ఇంజనీర్లు కేవలం ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా భూ సేకరణ వంటి పనులను కూడా చక్కబెడుతున్నారని మంత్రి ప్రశంసించారు. ఇంజనీర్స్ డే స్ఫూర్తితో ప్రతి ఇంజనీర్ రాష్ట్భ్రావృద్ధికి పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.