తెలంగాణ

కాలేజీలు మొదలైనా పూర్తికాని ‘కాంట్రాక్టు’ నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: కాలేజీలు మొదలై నెలరోజులు కావస్తున్నా కాంట్రాక్టు లెక్చరర్ల నియామక ప్రక్రియ పూర్తికాలేదు. కొంత మంది ఇప్పటికే చేరినా, ఇటీవల జరిగిన రెగ్యులర్ లెక్చరర్ల పదోన్నతులు, బదిలీలతో కాంట్రాక్టు లెక్చరర్లకు స్థానభ్రంశం కల్పించిన అధికారులు ఇంకా వారిని నియమించలేదు.
ప్రభుత్వ కళాశాలలను అన్ని విధాలుగా కాపాడుతూ ఉద్యోగ భద్రత కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్‌ల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెరాస అధికారంలోనికి రాగానే కాంట్రాక్టు వ్యవస్థకు మంగళం పాడుతామని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేసినా ఇంత వరకు కాంట్రాక్టు లెక్చరర్‌ల సర్వీసులు రెగ్యులరైజ్ కాలేదు. కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం సర్వీసుల క్రమబద్ధీకరణను దాట వేస్తున్నా కనీసం వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించలేక పోయింది. రెగ్యులర్ లెక్చరర్‌లకు బదిలీలు నిర్వహించడంతో దాదాపు 400 మంది లెక్చరర్‌లు కాంట్రాక్టు లెక్చరర్‌లు విధులు నిర్వహిస్తున్న స్థానాలలో వచ్చి విధుల్లో చేరారు. దాంతో కాంట్రాక్టు లెక్చరర్‌ల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. ఇంత వరకూ కాంట్రాక్టు లెక్చరర్లకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం కాంట్రాక్టు అద్యాపకుల సంఘం నాయకులు ఇంటర్ విద్య కమిషనర్‌ను కలిసి ఉద్యోగం కోల్పోయిన వారికి పోస్టులు ఖాళీగా ఉన్న కళాశాలల్లో పోస్టింగ్ ఇవ్వాలని విన్నవించారు.
ఇదిలా ఉండగా ఇంటర్ విద్య నుండి డిగ్రీకి వెళ్లిన మరో 64 మంది లెక్చరర్‌లు నేడు డిగ్రీ నుండి తిరిగి ఇంటర్ కళాశాలలకు వస్తున్నారు. వారు కూడా కాంట్రాక్టు లెక్చరర్‌లు విధులు నిర్వహిస్తున్న స్థానాలపైనే పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతీ ఒక్కరూ తాము విధులు నిర్వహిస్తున్న పోస్టులనే టార్గెట్ చేస్తుండటం వలన తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని కాంట్రాక్టు లెక్చరర్‌లు వాపోతున్నారు. కనీసం తమకు ఈ సారి బదిలీల సౌకర్యం కూడా లేకుండా పోయిందని తాము ఏళ్ల తరబడి దూర ప్రాంతాలలో విధులు నిర్వహించాల్సి వస్తోందని లెక్చరర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3670 మంది కాంట్రాక్టు లెక్చరర్‌లను క్రమబద్దీకరించేందుకై జీవో నంబర్ 16ను జారీ చేసింది. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కోర్టులో కేసులు వేయడంతో క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. ఏడాది క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈ కాంట్రాక్టు లెక్చరర్‌ల క్రమబద్ధీకరణకు కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ అధికార పక్షం విమర్శలు గుప్పించడమే కాకుండా కాంట్రాక్టు అద్యాపకులు తమ ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీభవన్‌ను సైతం ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. కోర్టు కేసులను వెనక్కి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు అందర్నీ వేడుకున్నారు. కాంట్రాక్టు వ్యవస్థ అనేది వెట్టిచాకిరీతో సమానమని అటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండనే ఉండదని ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కెసీఆర్ అనేక సభలలో స్పష్టం చేసిన సంగతి విధితమే. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలంటూ భారత ఉన్నత న్యాయస్థానం సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన తమకు కనీసం బేసిక్‌పే, డిఎను చెల్లించైనా ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గత 2016డిసెంబర్ మాసంలో కాంట్రాక్టు లెక్చరర్‌లు రాష్ట్ర వ్యాపితంగా నిరవధిక సమ్మెను సైతం చేపట్టారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని మంత్రి హరీష్‌రావ్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పి రాజేశ్వర్‌రెడ్డిలు హామీలు ఇవ్వడంతో కాంట్రాక్టు లెక్చరర్‌లు సమ్మెను విరమించారు. దాంతో 2017 జూన్ నుండి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్‌లకు ప్రతీ నెలా 37100 రూపాయల మూల వేతనాన్ని చెల్లిస్తున్నా ఇవి కూడా నెలల తరబడి ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోవాల్సి వస్తోంది. తమకు బేసిక్ పే, డిఎ కూడా ఇవ్వక పోవడంతో తాము ఇలా ఎన్నాళ్లు ఉద్యోగ భద్రత కోసం ఎదిరి చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల నిర్వహణలో కాంట్రాక్టు లెక్చరర్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం వీరి విషయంలో ఏళ్ల తరబడి ఊరిస్తుండటం ఎంత వరకు సమంజసమని ఆయా వర్గాల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే కోర్టు కేసులు క్రమబద్ధీకరణకు ఏ మాత్రం అడ్డు కావని, మనవీయ కోణంలో తమను తక్షణమే రెగ్యులరైజ్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కాంట్రాక్టు లెక్చరర్‌లు కోరుతున్నారు.

52 శాతం రిజర్వేషన్ల కోసం
పంచాయతీరాజ్ చట్ట సవరణ
* కాంగ్రెస్ అధికార ప్రతినిధి డిమాండ్
హైదరాబాద్, జూలై 11: బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తమ పార్టీపై నిందలు వేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలు ఉన్నారని ప్రభుత్వమే తేల్చి చెప్పిందని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. అటువంటప్పుడు బీసీలకు పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్లు ఎలా ప్రతిపాదించారని, మిగతా 18 శాతం బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరో స్వప్న రెడ్డి అనే సర్పంచ్ కేసు వేస్తే దానికి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌కు చెందిన గోపాల్‌రెడ్డి కూడా కేసు వేసినా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఒక బీసీ బిడ్డగా కోర్టుకు వెళ్ళానని, కులాల గణన జరగకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని, బీసీల్లో అన్ని కులాల వారికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే ఎ,బి,సి,డి వర్గీకరణ కావలన్నది తన ప్రధాన డిమాండ్ అని అన్నారు. అది జరగాలంటే ముందుగా కులాల గణన జరగాలని అలా కాకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని డాక్టర్ శ్రవణ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.