తెలంగాణ

విభజన హామీల అమలుకు టీడీపీ పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు టీడీపీ పోరాటాలకు సన్నద్ధం అవుతోంది. సుమారు 60 ఏళ్ల పోరాటం అనంతరం రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు ఎన్నో హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి చేయక పోవడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఇలా ఎన్నో హామీలు నేరవేర్చాల్సి ఉంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నా ప్రశ్నించే నాధుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. కేంద్రం నుంచి హామీలను రాబట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని దుయ్యబడుతున్నారు.
ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో విభజన హామీల కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలు జరుగుతుండగా, తెలంగాణలో కనీసం మాట్లాడవారే లేకుండా పోయారని వాపోయారు. బీజేపీతో అంతర్గతంగా పొత్తు కొనసాగిస్తున్న కేసీఆర్ స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్భ్‌వన్‌లో విభజన హామీలపై టీటీడీపీ అధ్యక్షుడు రమణ అధ్యక్షతన సమావేశమైన నేతలు ఉద్యమ కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదట గవర్నర్ నర్సింహన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. అనంతరం పార్టీ తరపున కేంద్రానికి విజ్ఞాపన పత్రాలు పంపించాలని నిర్ణయించారు. అనంతరం జూలై 17 నుంచి ప్రజా ఉద్యమాలతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈనెల 27న ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం వేలాది మందితో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్ ఇతర హామీలపై టీడీపీ ఉద్యమించనుంది. ఉద్యమాలను పార్టీ పరంగా కాకుండా ప్రజా ఉద్యమంలా నిర్వహించేందుకు విభజనకు ముందుకు కేంద్రం ఇచ్చిన హామీలను వివరించి, ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించనున్నారు.