తెలంగాణ

కేంద్రం చేతిలో రాష్ట్రాల హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం నాడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నిర్వహించిన ఉన్నత విద్యా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఉన్నత విద్యా కమిషన్ బిల్లుపై స్పందించారు. చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్యను అందించే విధంగా ఉండాలని, యూనివర్శిటీలకు నేరుగా నిధులు ఇచ్చే మార్గదర్శకాలు ఉండాలని అన్నారు. అధ్యాపకులకు ఇన్ సర్వీసు శిక్షణ తప్పని సరిచేయాలని చెప్పారు. ఉన్నత విద్యను ఉద్ధరించే అంశాలు ఏవీ ఈ చట్టంలో కనిపించడం లేదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. రాజ్యాంగపర రాష్ట్ర హక్కులను కేంద్రం హస్తగతం చేసుకోవడం మంచిది కాదని అన్నారు. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని స్వతంత్రతను దెబ్బతీసే విధంగా కొత్త బిల్లు ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై పూర్తిగా చర్చించిన తర్వాత ఈ నెల 20వ తేదీలోపు కేంద్రానికి నివేదిక పంపుతామని అన్నారు. ఏ సంస్కరణలు అయినా మన విశ్వవిద్యాలయాలను గ్లోబల్ విశ్వవిద్యాలయాల సరసన నిలిపే విధంగా ఉండాలని అన్నారు. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకూ అధ్యాపకులకు ఇన్ సర్వీసు శిక్షణ ఖచ్చితంగా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు ఇలాంటి అంశాలకు కాకుండా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాల అధికారులను నేరుగా నియమిస్తూ అధికార కేంద్రీకరణ చేయడం మంచిది కాదన్నారు. అదే విధంగా రాష్ట్రాలకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులు కూడా కేంద్రం హస్తగతం చేసుకునేలా ఈ బిల్లు ఉందని అన్నారు. ఇటీవల కొన్ని వర్శిటీల్లో కేంద్రమే నేరుగా వీసీలను నియమించడం కూడా తప్పుడు సంకేతాలను ఇస్తోందని అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో ఎక్కువగా బ్యూరోక్రాట్లకు పనిచెప్పి, విద్యావేత్తలకు, నిపుణులకు పనిలేకుండా చేసినట్టుందని అన్నారు. ఈ విధానం విద్యావ్యవస్థకు అనుకూలమైంది కాదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీల నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కేంద్రం గత నాలుగేళ్లుగా విద్యారంగానికి నిధులు తగిస్తోందని చెప్పారు. కేంద్ర విద్యా సంస్థల్లో కూడా సగానికి పైగా ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని కడియం ఆరోపించారు. దేశంలో నూతన విద్యావిధానంపై నివేదిక రాకుండానే మళ్లీ కొత్త కమిషన్ కోసం ప్రతిపాదనలు అడగడం వల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాల్లో అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసే వీలును రాజ్యాంగం కల్పించిందని, దానిని సమర్ధించే రీతిలో కొత్త బిల్లు లేదని అన్నారు. ఈ బిల్లులోని ప్రతి క్లాజుపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన వీసీలను, నిపుణులను కోరారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి పంపిస్తామని, ఆయన ఆమోదం మేరకు 20వ తేదీలోగా కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతారన్నారు.

కేంద్రం తారుమారు చేస్తోంది: అసదుద్దీన్
ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ డ్రాఫ్ట్‌పై అభిప్రాయం చెప్పేందుకు ఇచ్చిన సమయం సరిపోదని అన్నారు. కేంద్రప్రభుత్వం ఐడియా లాజికల్‌గా మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కమిషన్ ఏర్పాటుతో ఫీజులు పెరుగుతాయని, కమిషన్లో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉన్నారని, రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని అన్నారు. ఇది అన్ని వర్గాలకు వ్యతిరేకమని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: కే కేశవరావు
ఎంపీ కేశవరావు మాట్లాడుతూ డ్రాఫ్ట్ బిల్లులోని ప్రతిసెక్షన్ ఫెడరల్ స్ఫూర్తిని సవాలు చేసేలా ఉందన్నారు. సెలక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వమే కరిక్యులమ్ తయారుచేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ బిల్లులో అనేక వైరుధ్యాలున్నాయని చెప్పారు. విద్యావ్యవస్థను అధికారుల చేతుల్లో పెట్టడమేనని అన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఉన్నత విద్యా కమిషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ పలువురు విద్యావేత్తలు, నిపుణులు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందించారు. ఈ సదస్సులో అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, వైస్ ఛాన్సలర్లు, మాజీ వీసీలు, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, ఎన్‌జీవోల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.