తెలంగాణ

2లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: వచ్చే నెలలో రెండు లక్షల మంది నిరుద్యోగులతో హైదరాబాద్ దిగ్బంధించాలని తెలంగాణ నిరుద్యోగ జాక్ నిర్ణయించింది. మంగళవారం నిరుద్యోగ జాక్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగులు పీజీ-డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కళాశాల కోర్సులు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు. కొత్త ఉద్యోగాలు సృష్టించాలని తాము డిమాండ్ చేయడం లేదని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే తొలుత భర్తీ చేయాలని కోరుతున్నామన్నారు. గ్రూపు-1లో 1200 ఉద్యోగాలు, గ్రూపు-3లో 8 వేల ఉద్యోగాలు, గ్రూపు-4లో ఉద్యోగాలు 36 వేలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.