తెలంగాణ

ఉన్నత విద్యాకమిషన్ వద్దేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్యా కమిషన్‌ను ఇప్పటికే ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తెలంగాణ సైతం ఉన్నత విద్య కమిషన్ వల్ల రాష్ట్రానికి అనుకున్న రీతిలో న్యాయం జరగదని భావిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, పాండిచ్చేరి, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నత విద్యా కమిషన్‌పై విముఖత వ్యక్తం చేశాయి. యూజీసీ చేసిన సేవలను ఉన్నత విద్యా జాతీయ కమిషన్ చేస్తుందనే నమ్మకం లేదని ఈ రాష్ట్రాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సైతం తమ అభిప్రాయాన్ని ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్‌పై తమ నిరసన వ్యక్తం చేసింది, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ విముఖత వ్యక్తం చేసింది. జాతీయ కమిషన్‌లో అంతా అధికారులను మాత్రమే నియమించడంతో రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థలపై కేంద్రం తన అజమాయిషీ పెంచుకోవాలని చూస్తుందనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. చైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లను కేంద్రం నియమిస్తుంది. అయితే వీరంతా అధికార పార్టీ చెప్పుచెతుల్లో పనిచేస్తున్నపుడు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కమిషన్ ప్రతిపాదనతో ఉన్నత విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని, కేంద్రం తాము అనుకున్న ఆలోచనలను విద్యారంగంపై రుద్దడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందనే భయాన్ని విద్యా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీలకు స్వయం ప్రతిపత్తి ప్రకటించడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, సిలబస్ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ఒక వేళ కేంద్ర పభుత్వం మాట వినని యూనివర్శిటీలను ప్రమాణాలు లేవని, నిబంధనలు పాటించడం లేదనే సాకుతొ వాటిని రద్దు చేయడం లేదా నిధులు నిలుపు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సలహా కమిటీ కేంద్ర మానవ వనరుల మంత్రి ఆధీనంలో ఉండటం వల్ల దానికి స్వయం ప్రతిపత్తి ఉండదని వారు అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యా కమిషన్ తన కార్యకలాపాల్లో భాగంగా ప్రైవేటు యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు, విదేశీ యూనివర్శిటీలకు ప్రాధాన్యత ఇచ్చే పక్షంలో సామాన్యులైన భారతీయ విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారుతుందనే భావన వ్యక్తం అవుతోంది. అలాగే ఎన్‌జీవోలు సైతం కేంద్రం ప్రతిపాదించిన చట్టంతో మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడ్డాయి. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ కన్వీనర్ ఎన్ నారాయణ, కో కన్వీనర్ డాక్టర్ ఏ నాగేశ్వరరావులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అలాగే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. కమిషన్‌లో విద్యా వేత్తల కంటే అధికారులే ఎక్కువగా ఉండటం వల్ల కమిషన్ చేసే ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు ఉన్నత విద్యాభివృద్ధి కంటే బీజేపీ పార్టీ ప్రభుత్వ విధానాలైన కాషాయికరణ, కార్పొరేటీకరణ, విదేశీకరణకే తోడ్పడతాయని విద్యానిపుణులు అభిప్రాయపడ్డారు. ఏకీకృత విధానం పేరుతో కోర్సులు, సిలబస్, బోధనా సామర్ధ్యం , పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వంటి విషయాలు కమిషన్ నిర్దేశిస్తే విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తి హుళక్కే అవుతుందని , భిన్నాభిప్రాయాలు, వివాదాల విషయాల్లో కేంద్ర విద్యాశాఖా మంత్రి నేతృత్వంలోని అడ్వయిజరీ కౌన్సిల్‌దే తుది నిర్ణయమైతే కేంద్రం పెత్తనానికి పట్టం కట్టినట్టవుతుందని , అడ్వయిజరీ కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి నామమాత్రపు ప్రాతినిధ్యం ఉన్నా ఒరిగేది ఏమీ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూడటం మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంగా చెప్పారు. కొత్త బిల్లు అమలులోకి వస్తే విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని స్వతంత్రతను దెబ్బతీసినట్టవుతుందని చెబుతున్నారు. ఈ బిల్లుపై తమ అభిప్రాయాలను చెప్పేందుకు కేంద్రం ఈ నెల 20వ తేదీ వరకూ గడువు విధించింది.