తెలంగాణ

పారదర్శకంగా కారుణ్య నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: సింగరేణిలో కారుణ్య నియామకాలపై అపోహాలు నమ్మవద్దని సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గత నాలుగు నెలలుగా ప్రారంభించిన కారుణ్య నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మెడికల్ బోర్డులో 1,385 మంది కార్మికులు అనారోగ్య కారణాలతో హాజరు కాగా వీరిలో 998 మందిని మెడికల్ ఇన్‌వాలిడేట్ చేయడం జరిగిందని అన్నారు. కార్మికులు దరఖాస్తు చేసుకున్న నాటికి రెండు సంవత్సరాలు సర్వీస్ మిగిలున్న కార్మికులందరూ అర్హులేనని సంస్థ స్పష్టం చేసింది. కార్మికులు చివరి పనిదినంతో దీనికి సంబంధం లేదన్నారు. ఈయేడాది మార్చి నుంచి 2020 జూన్ వరకు పదవీ విరమణ పొందే 640 మంది కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.కొంత మంది కార్మికులు తమను పిలువలేదని ఆందోళన చెందుతున్నట్లు సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. మెడికల్ బోర్డు ఫలితాలు సాధ్యమైనంత వరకు అదే రోజు వెల్లడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మెడికల్ బోర్డులో ఎటువంటి పైరవీలకు అవకాశం లేదన్నారు. సమావేశంలో జనరల్ మేనేజర్ ఎం ఆనందరావు, మహ్మద్ మసూద్ ముజిహిద్, జనరల్ మేనేజర్ బసవయ్యతో పాటు సింగరేణి పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.
కేంద్ర సమాచార శాఖ అదనపు డీజీగా టీవీకే రెడ్డి
హైదరాబాద్, జూలై 18: కేంద్ర సమాచార శాఖ (తెలంగాణ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా తుమ్మ విజయకుమార్‌రెడ్డి (టివికె రెడ్డి) బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో ఎంపికయ్యారు. డిల్లీలో డిఏవిపి విధులు నిర్వర్థిస్తున్న రెడ్డి బదిలీపై తెలంగాణకు వచ్చారు. ఈయన సమాచార శాఖ ఏర్పాటు చేసిన రీజినల్ అవుట్ రీచ్ బ్యూరోగా కొనసాగుతారు. గతంలో రెడ్డి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో పని చేశారు. గ్రామీణ విలేఖరులకు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.