తెలంగాణ

రియల్టర్ల మోసాలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: రియల్టర్ల మోసాలకు కళ్లేం వేసి తెలంగాణ స్టేట్ రియల్ ఏస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా) వచ్చే నెల ఆగస్టు నుంచి అమలులోకి రాబోతోంది. రియల్టర్ల మోసాలకు ఇక నుంచి కొనుగోలుదారులు బలి కాకుండా ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై కొనుగోలుదారులు, రియల్టర్లకు అవగాహన కల్పించడానికి వచ్చే వారం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. రెరా చట్టం ఆగస్టు నుంచి అమలులోకి రానుండటంతో రియల్టర్లు తప్పనిసరిగా రెరా చట్టం కింద తమ సంస్థల పేర్లు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కొత్త వెంచర్ల అనుమతికి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, స్థానిక సంస్థల పరిధిలో దరఖాస్తు చేసుకునే ప్రతీ రియల్టర్ తప్పనిసరిగా రెరా చట్టం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారు, బిల్డర్ ఇరువురికి మధ్య జరిగే ఒప్పందం పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇరువురికి మధ్య కుదిరిన ఒప్పందాన్ని విస్మరిస్తే జరిమానా విధించే విధంగా చట్టం రూపొందించామన్నారు. రియల్ ఏస్టేట్ వ్యవస్థను చట్టం పరిధిలోకి తీసుకరావడం వల్ల లావాదేవీలన్ని ఇక నుంచి పారదర్శకంగా సాగుతాయన్నారు. ఒప్పందాలను విస్మరించే రియల్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు కొనుగోలుదారుల హక్కుల రక్షణకు రెరా చట్టం దోహదం చేస్తుందని ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ వివరించారు. రియల్టర్లపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చట్టం కొనుగోలుదారుల హక్కులను ఏ విధంగా కాపాడుతుందో రెరా చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు.