తెలంగాణ

ఉచిత ప్రచారం కోసం దేవుళ్లపై వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: కొందరు కావాలనే ఉచిత ప్రచారానికి హిందూ దేవుళ్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ స్వామి పరిపూర్ణానంద రామ నామ జపం చేస్తూ పాదయాత్ర చేస్తా అని చెబితే పోలీసులు అడ్డుకుని నగర బహిష్కరణ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాని తాము అనుకుంటే అసెంబ్లీ నుండి ప్రగతి భవన్‌కు వెళ్దామనుకుంటే అరెస్టు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పాలన నిజాం పాలనలా ఉందని ప్రభుత్వ తీరు చూస్తుంటే దమనకాండలా ఉందని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని, ఒక్కో ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఒక్కో పోలీసు స్టేషన్‌కు తరలించారని , ఇది ప్రభుత్వ చేతకాని తనమేనని అన్నారు. ఎవర్నీ రెచ్చగొట్టాలని , అశాంతి నెలకోల్పాలని తాము ప్రగతి భవన్‌కు వెళ్లలేదని, పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించారని ఇది చాలా అన్యాయమని పేర్కొన్నారు. ఓట్ల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, మంగళవారం నాడు ప్రభుత్వం జరిపిన అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వామీజీపై విధించిన నగర బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలో నాలుగేళ్ల నుండి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఈ ఏడాది 40వేల మందికి బూట్లు, సాక్సులు ఇస్తున్నామని, 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థులు అందరికీ సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకున్న వారికి పుస్తెలు, మట్టెలు, చీర, సూట్ వంటివి అందిస్తున్నామని, అదే తరహాలో కంటి సమస్యలున్న వారికి నేత్రజ్యోతి కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కిడ్నీ బాధితులకు ఉచితంగా పరీక్షించి మందులు, డయాలసిస్ చేయిస్తున్నామని, ఈ విధంగా రోజుకు 150 మందికి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.