తెలంగాణ

ఎంసెట్ పేపర్ లీకేజి నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18:ఎంసెట్-2 లీకేజిలో నిందితులుగా ఉన్న వారికి మరో 14 రోజులు జుడీషయల్ కష్టడీకి అనుమతించినట్లు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి కుంభకోణంలో నిందితులుగా ఉన్న వాసుబాబు, శివనారాయణతో పాటు మరో కీలక వ్యక్తిని గుర్తించినట్లు సిఐడి పోలీసులు చెబుతున్నారు. ఎంసెట్ నింధితులు గత కొంతకాలంగా సిఐడి కష్టడీలో ఉన్నారు. కష్టడీ గడువు ముగియడంతో వారిని నాంపల్లి కోర్టుకు హాజరు పర్చారు. ఈ కేసులో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయన్న కోణంలోదర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆరు క్యాంపులు నిర్వహించామని, మరో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు మెడికో గణేష్ ప్రసాద్‌ను వారం రోజులు కష్టడీకి అనుమతి ఇవ్వాలని సిఐడి కోర్టులో ఫిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. వాసుబాబు, శివనారాయణలు చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో ఉద్యోగులు గుర్తించినట్లు తెలిపారు.
10,599 మందికి బీఈడీ సీట్లు
25నుండి తరగతులు * 24న తుది దశ కౌనె్సలింగ్ నోటిఫికేషన్
హైదరాబాద్, జూలై 18: రాష్ట్రంలోని బిఈడీ కాలేజీల్లో 10,599 మంది సీట్లు పొందారు. మే 31న నిర్వహించిన ఎడ్‌సెట్‌కు 32,330 మంది హాజరుకాగా, జూన్ 13న ప్రకటించిన ఫలితాల్లో 30,606 మంది అర్హత సాధించారు. తొలి దశ వెబ్ కౌనె్సలింగ్‌లో 20,815 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరుకాగా, అందులో 20,542 మంది తమ వెబ్ ఆప్షన్లను వినియోగించారు. రాష్ట్రంలో 195 బిఈడీ కాలేజీల్లో 12,788 సీట్లు ఉన్నాయి. సీట్లు పొందిన వారు ఈ నెల 23వ తేదీ నుండి కాలేజీల్లో రిపోర్టు చేయాలని, తరగతులు జూలై 25న ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. తుది దశ కౌనె్సలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్ధులు ఎడ్‌సెట్‌ఎడిఎం డాట్ టిఎస్‌సిహెచ్‌ఇ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే పోర్టల్‌లోకి వెళ్లి తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.