తెలంగాణ

కాగ్నిజెంట్‌కు ఎలక్ట్రిక్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థ తన హైదరాబాద్ క్యాంపస్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నది. ఈ మేరకు అగ్రగామి మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన వోరెర్ కార్స్‌లో టాటా మోటార్స్ భాగస్వామిగా మారింది. ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ అండ్ ప్లీట్ మేనేజ్‌మెంట్ విలువ జోడించిన సేవలతో ఈ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్‌ను కాగ్నిజెంట్‌కు అందిస్తోంది. కంపెనీ హైదరాబాద్ క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టాటా మోటార్స్ బృందం 10 ఎలక్ట్రిక్ వాహనాలను కాగ్నిజెంట్ అధికారులకు అందజేసింది. ఎలక్ట్రిక్ వాహనాలను వన్ టాటా సొల్యూషన్‌ను ఉపయోగించుకుంటూ, వాహనాలు, ఛార్జింగ్ వౌలిక వసతులు, నిర్వహణ సేవలు, పని తీరు, టిగోర్ వాహనాలు పొందేందుకు ఆర్థిక సహాయానికి సంబంధించిన సమగ్ర పరిష్కారాన్ని అందించేందుకు టాటా మోటార్స్, ఇతర టాటా గ్రూపు కంపెనీలతో కలిసి పని చేస్తున్నది. ఈ ఆర్డర్‌లో భాగంగా కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్‌కు వేగంగా ఛార్జింగ్ చేసే రెండు స్టేషన్లను సరఫరా చేసే వాటిని ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాలను సమకూర్చుకోవడానికి ఆర్థిక సహకారాన్ని టాటా మోటార్స్ ఫైనాన్స్ అందించనున్నది.
ఈ సందర్భంగా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకోవడంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ) శైలేశ్ చంద్ర మాట్లాడుతూ కాగ్నిజెంట్‌తో అనుబంధం ఏర్పరచుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరామ్ కుమార్ రామమూర్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. వక్తి, మొబిలిటీకి సంబంధించి ఒక వినూత్నంగా ఎలక్ట్రిక్ వాహనాలకు గల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడంలో దేవంలో ఆ ఘనతను సాధించిన మొదటి కంపెనీల్లో తాము ఒకటి కావడంతో తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. టాటా పవర్ సిఇవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ టాటా పవర్‌కు ఇది ఒక మైలురాయి అన్నారు. ఈ సహకారం హైదరాబాద్‌లో తమ ఉనికిని పటిష్టం చేస్తుందన్నారు. ఈ భాగస్వామ్యంతో, ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్‌ను విస్తరించడం ద్వారా తాము హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాలకు సిన్నద్ధం చేస్తామని ఆయన తెలిపారు.