తెలంగాణ

కలెక్టర్ చైర్మన్‌గా అప్రెంటిస్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ఉపాధి కల్పనా అవకాశాలను మెరుగుపరచేందుకు జిల్లా స్థాయిలో అప్రెంటిస్ కమిటీలను ఏర్పాటు చేశారు. 31 జిల్లాల్లో ఈ తరహా కమిటీలను ప్రభుత్వ గురువారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఒక జీఓ (ఎంఎస్ నెంబర్ 37) జారీ అయింది. జిల్లా అప్రెంటిస్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా పరిశ్రమల మేనేజర్, ప్రైవేట్ ఐటీఐల ప్రిన్సిపాళ్లు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ , ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలు, వాణిజ్య శాఖ డిప్యూటీ కమిషనర్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ అధికార ప్రతినిధి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ పథకం (ఎన్‌ఏపీఎస్) అమలుపై ప్రతినెలా ఒక పర్యాయం ఈ కమిటీ సమీక్షించాల్సి ఉంటుంది. వాణిజ్య సంస్థలు, అప్రెంటిస్‌లలో ఎన్‌ఏపీఎస్‌పై చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. ఎన్‌ఏపీఎస్ అమలు చేయడంలో రాష్టస్థ్రాయి అప్రెంటిస్ కౌన్సిల్‌తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఐటీఐల ప్రిన్సిపాళ్లు తరచూ వాణిజ్య సంస్థలు, పరిశ్రలమలను సందర్శిస్తూ వారు అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదయ్యేలా చూడాలి. తరచూ ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళాలను నిర్వహించాలి. తెలంగాణ ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్ ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.
మాజీ మంత్రి సుజాతపై అనుచిత పోస్టింగ్
చింతలపూడి, జూలై 19: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై చింతలపూడి మండలం భట్టువారిగూడెం ఎంపీటీసీ సభ్యుడు డి వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక వ్యక్తి ఎమ్మెల్యేపై అసభ్యకరంగా పోస్టు చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చింతలపూడి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.