తెలంగాణ

ప్రాంగణ ఎంపికల్లో జేఎన్‌టీయూహెచ్ సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో జెఎన్‌టీయూహెచ్ విద్యార్థులు అదరగొట్టారు. క్యాంపస్ నియామకాల తొలిదశలోనే 24 మంది విద్యార్థులు మంచి వేతనాలకు వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. ఏటా 36 లక్షల వేతనానికి పి నిఖిలను మైక్రోసాఫ్ట్ ఎంపిక చేయగా, ఏటా 24 లక్షల వేతనానికి వి శ్రీసాయి పూజితను మైక్రో సాఫ్ట్ ఎంపిక చేసింది. శ్రీచరణ్‌రెడ్డి, శ్రీ్ధర్ బి, అభిలాష్, హర్ష ప్రియ దగ్గుబాటి, ఆలేటి సుమలతలను జోహో కంపెనీ 6.6 లక్షల వేతనానికి ఎంపిక చేసింది. బాలమహేష్ గౌడ్, చెలిమల శివ, హర్షిత , ప్రవీణ్ సిద్గర్‌లను జోహో కంపెనీ 4.4 లక్షల వార్షిక వేతనానికి ఎంపిక చేసింది. మాథ్స్ వర్క్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మరో 11 మందిని ఎంపిక చేసింది. అందులో ఎ సమత, పి కశ్యప్, ఎం అమిత్‌రెడ్డిలకు ఏటా 17 లక్షల వేతనానికి ఎంపిక చేసింది. టెరాడాటా సైతం ముగ్గుర్ని ఎంపిక చేసింది. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ తీసుకున్న చర్యలను వీసీ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ సాయిబాబారెడ్డి ప్రత్యేకించి అభినందించారు. జూలై 17, 18 తేదీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరిగిందని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ జె సురేష్‌కుమార్, అసోసియేట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుష్మా తెలిపారు. గత ఏడాది 83 ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌కు వచ్చి 95 శాతం విద్యార్థులకు ఉపాధి కల్పించారని వారు వివరించారు.