తెలంగాణ

కమిషన్‌తో కొత్త సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్యా కమిషన్‌పై రాష్ట్ర ప్రజలు, నిపుణులు, అధికారుల అభిప్రాయాలతో కూడిన నివేదికను ఉన్నత విద్యా మండలి అధికారులు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్‌ను కలిసి అందజేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీవీ వెంకటరమణ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాష్ట్ర అభిప్రాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా వీరంతా ఎంపీలు బి వినోద్‌కుమార్, కవిత, బి సుమన్ , ఎపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్ కే కేశవరావులను కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్యా కమిషన్‌తో ఉన్న కొత్త సమస్యలను వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో ఉన్నత విద్యా కమిషన్‌పై చర్చకు వచ్చినపుడు రాష్ట్ర విధానంపై వారు ఎలుగెత్తనున్నారు. పనిలో పనిగా యూజీసీ అధికారులను కలిసి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున నిధులు అందించాలని కోరారు. విద్యాసంస్థల అభివృద్ధికి యూజీసీ కట్టుబడి ఉందని యూజీసీ చైర్మన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.
నేడు కాంట్రాక్టు లెక్చరర్ల దీక్ష
కాంట్రాక్టు లెక్చరర్లకు బదిలీలు చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వం మాట నిలుపుకోవాలని కోరుతూ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్టు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు జె కురుమూర్తి, ప్రచార కార్యదర్శి సయ్యద్ జమీఉల్లా తెలిపారు. రాష్ట్ర నాయకులు కొప్పిశెట్టి సురేష్, రమణారెడ్డిలు కూడా పాల్గొంటారని వారు చెప్పారు. లెక్చరర్లు అంతా కమిషనర్ కార్యాలయం వద్దకు రావాలని వారు పేర్కొన్నారు. ఒక పక్క జీతాలు అందక, మరో పక్క క్రమబద్ధీకరణ జరగక, ఇంకో పక్క సకాలంలో బదిలీలు కాక కాంట్రాక్టు లెక్చరర్లు నానా అగచాట్లు పడుతున్నారని వారు చెప్పారు.