తెలంగాణ

జీహెచ్‌ఎంసీ ఉద్యోగాల భర్తీకి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉన్న ఖాళీల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ రెండు వేర్వేరు ప్రకటనలను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ రెండు రిక్రూట్‌మెంట్లకూ తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతి మంజూరు చేసినా, రోస్టర్, సిలబస్, పరీక్ష విధానం, సర్వీసు నిబంధనలను రూపొందించడంలో జాప్యం జరిగింది. వీటిని తొలుత గ్రూప్-4లో విలీనం చేయాలని భావించినా, ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరువేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని సర్వీసు కమిషన్ నిర్ణయించింది. మరో వారంలో హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను ఇవ్వనుంది. వీటి ద్వారా 88 పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిసింది. వీటిలో 50 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, 35 శానిటరీ ఇనస్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.

పిడుగు పడి మరణిస్తే రూ. ఆరు లక్షల పరిహారం
మారిన నియమావళి * ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, జూలై 19: పిడుగుపాటుకు ఎవరైనా మరణిస్తే ఇక నుండి ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిడుగుపాటును ఇక నుండి ప్రత్యేక వైపరీత్యంగా (స్పెషల్ డిజాస్టర్) పరిగణించాలని నిర్ణయించారు. ఈ కారణంగానే పిడుగుపాటుకు ఎవరైనా మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని పెంచారు. గతంలో పిడుగుపాటుకు మరణించిన వారికి ఆపద్భందుకింద 50 వేల రూపాయలు పరిహారంగా చెల్లించేవారు. పిడుగుపాటును ఆపద్భందు జాబితాలో చేర్చడం వల్ల తక్కువ పరిహారం లభించేది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం స్పెషల్ డిజాస్టర్ జాబితాలో పిడుగుపాటును చేర్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా పిడుగుపాటుకు మరణిస్తే సంబంధిత తహశీల్దారు/ఆర్‌డీఓ వెంటనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది. తహశీల్దారు/ఆర్‌డీఓ నుండి వచ్చిన నివేదికను జిల్లాస్థాయిలో ఉండే త్రిసభ్య కమిటీ పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించి నష్టపరిహారాన్ని మరణించిన వారి కుటుంబానికి మంజూరు చేస్తుంది.