తెలంగాణ

ఈ-రశీదులతో రుణాలు సులువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 21: తెలంగాణలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని గోదాములను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి ఈ-రశీదు విధానాన్ని అమలుపర్చనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. గోదాముల్లో నిల్వలు ఉంచే రైతులు, వ్యాపారులకు ఈ-రశీదు ఇచ్చే అందించే విధానాన్ని రాష్ట్రంలో తొలిసారిగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 38 గోదాములు ఉండగా వాటన్నీంటిని కంప్యూటరీకరించి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల్లో పారదర్శకత పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరలకే రైతులు తాము అమ్ముకొని బాధపడేవారన్నా రు. ఇలాంటి పరిస్థితులను రూపుమాపి రైతులు తాము పండించిన పంటలకు తగిన ధరలు వచ్చేంత వరకు గిడ్డంగుల్లో తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. రైతులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ ఉంచితే అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు చేతి రాతతో రాసి అందించే వారని వీటితో బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యేవన్నారు. అందువల్ల రుణాలు అందక రైతులు నష్టపోతుండేవారన్నారు. పురాతన పద్ధ తులకు స్వస్తి పలికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పూర్తిస్థాయిలో గిడ్డంగులను కంప్యూటరీకరిస్తున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులు గోదాముల్లో దాచిన వివరాలను ఆన్‌లైన్‌లో పొం దుపర్చి వారికి ఈ-రశీదు కాపీని జారీ చేస్తామన్నారు. ఈ-రశీదులను ఇవ్వడం ద్వారా రైతులు, వ్యాపారులు ఇక నుండి సులువుగా బ్యాం కుల నుండి రుణాలు పొందవచ్చన్నారు. తెలంగాణలో తొలిసారిగా ఈ విధానాన్ని సూర్యాపేట జిల్లా నుండే ప్రారంభిస్తుండడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ గోదాములను కంప్యూటరీకరించి ఈ-రశీదు విధానాన్ని అమలు చేయడం వల్ల రైతులను ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న గోదాములన్నింటిని కంప్యూటరీకరణ చేస్తున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను కూడా కంప్యూటరీకరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 35శాతం రాయితీని 50శాతానికి పెంచే విధంగా ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రాంతీయ అధికారి సామ్యేల్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర గిడ్డంగుల అభివృద్ది సంస్థ చైర్మన్ పట్నాయక్, సభ్యుడు శ్రీనివాస్, ఎన్‌ఈఆర్‌ఎల్ ప్రాంతీయ అధికారి అభిషేక్‌రాయ్, సూర్యాపేట గిడ్డంగుల సంస్థ మేనేజర్ సుధాకర్ పాల్గొన్నారు.