తెలంగాణ

జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 21: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు వద్ద అధికార యంత్రాం గం అప్రమత్తమై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జూరాల జలాశయంలో 318.350 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్ల ను నాలుగు మీటర్లు, 4 గేట్లను రెండు మీటర్లు, 3 గేట్లను ఒక మీటరు, 1 గేటును ఐదు మీట ర్లు, 2 గేట్లను మూడు మీటర్లు, 2 గేట్లను మూడున్నర మీటర్ల చొప్పున ఎత్తుఎత్తి 1,44,050 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా జూరాలపై ఆధారపడిన సాగునీటి ప్రాజెక్టు నెట్టెంపాడుకు 2250, భీమా లిఫ్ట్-1, 2లకు 2,800, సమాంత ర కాలువకు 1100, కుడి, ఎడమ కాలువలకు 1375, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల జలవిద్యుత్కేంద్రం 6 యూనిట్లకు 48 వేల క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. అదే విధంగా ఎగువ ప్రాం తంలో ఆల్మట్టి జలాశయంలో 129.72 టీఎంసీలకు గాను 113.23 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 1,73, 920 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 37.64 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 33.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి నారాయణపూర్‌కు 1,73,920 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుండి దిగువకు 1,83,140 క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ఉధృతి స్థిరంగా ఉండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు మరోవారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూరాలకు వస్తున్న వరద గేట్ల ఎత్తివేతను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.