తెలంగాణ

బిరాబిరా కృష్ణమ్మ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 21: కృష్ణానది ప్రవాహం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులను దాటి తెలంగాణలో పరవళ్లు తొక్కుతుండటంతో జూరాల, తుంగభద్రల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నీరు చేరుతుండటం దిగువన నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పంటల సాగుపై ఆశలు రేపాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన అల్మట్టి, నారాయణపూర్‌ల నుండి జూరాలకు భారీగా వరద నీరు రావడం, జూరాల 15గేట్లు ఎత్తడం, తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తడంతో శ్రీశైలానికి లక్ష 85వేల క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలంకు చేరుతుంది. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి లక్ష 60వేల క్యూసెక్కుల మేరకు నీరు జూరాలకు చేరుతుండంతో జూరాల 15గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర, ఇటు జూరాల నుండి వస్తున్న వరద నీరు ఇలాగే సాగితే వారం పది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి పెరుగనుందని అంచనా వేస్తున్నారు. సాగర్ ఎగువన ప్రాజెక్టులకు వరద ఉదృతి పెరిగిన నేపధ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.98లక్షల ఎకరాల సాగర్ ఎడమకాలువ రైతుల్లో పంటల సాగుపై ఆశలు పెరిగాయి. ఇప్పటికే వరినార్లు పోసుకుని రైతులు కృష్ణవేణి రాకకోసం ఎదురుచూపులు పడుతున్నారు. శనివారం రాత్రికల్లా శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం 215.18 టీఎంసీలకుగాను 45 టీఎంసీల నీరు చేరింది. ఎగువన జూరాల, తుంగభద్రల నుండి వస్తున్న నీటితో రెండు రోజుల్లో 26.5 టీఎంసీల నీటి మట్టం పెరుగడం విశేషం. ఇన్‌ఫ్లో లక్ష 90వేల క్యూసెక్కులుగా ఉండగా ఇదే రీతిలో రెండు వారాలు కొనసాగితే శ్రీశైలం నుండి కృష్ణమ్మ దిగువన నాగార్జున సాగర్‌కు తరలిరావడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 133.37 టీఎంసీలు నీటి మట్టం ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 312.05టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం నుండి పవర్ హస్ ద్వారా విడుదలవుతున్న నీరు సాగర్‌కు చేరుతుంది.