తెలంగాణ

ఒంటరిగానే టీజేఎస్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 13: ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేస్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. సమష్టి పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నలుగురి స్వార్థ ప్రయోజనాల కోసం నలిగిపోతోందని అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1990కి ముందు ఉన్న రాజకీయ విలువలను పునరుద్ధరించే విధంగా, తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ వికాసం కోసం టీజేఎస్ నిర్మాణం ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాటిన మొక్క రక్షణ కోసం నలుగురు సిబ్బంది, సీసీ కెమెరాల వాహనాలు పరిరక్షిస్తున్నాయని, అదే రైతు తన జీవనాధారమైన పంట పొలాల రక్షణ కోసం నీటిని విడుదల చేయాలని ఆందోళనలు చేస్తే మాత్రం నిర్బంధించి, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, ఇది అన్యాయమని మండిపడ్డారు. సమగ్రమైన విధానంతో, ప్రణాళికతో రాష్ట్భ్రావృద్ధికి కట్టుబడాలని, అంతేకాని కేవలం ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం కాలం గడుపుతుందని విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కరీంనగర్‌లో పురాతన కట్టడాలను కూల్చివేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు మాసాల్లో రూ.300కోట్లతో ప్రగతి భవన్ పూర్తి చేస్తుంది కానీ, అంబేద్కర్ విగ్రహాం, తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వంటి నిర్మాణాలను రోజులు గడుస్తున్నా నిర్మించడం లేదని ఆరోపించారు. తాను కరీంనగర్ నుంచి పోటీ చేయటమా ? ఇంకా ఎక్కడి నుంచైనా పోటీ చేయటమా అనేది తరువాత ప్రకటిస్తానని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, నరహరి జగ్గారెడ్డి, మొగురం రమేష్, కేశవరెడ్డి, ముక్కెర రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.