తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకుల వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ప్రారంభమైన జ్యోతిష మహాసభల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం కుదరడం లేదన్నారు. ఇందుకు జీఓ విడుదల చేస్తే, న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే రోస్టర్ విధానం పాటించాల్సి ఉంటుందని, ఆలయాల్లో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రత్యామ్నాయ విధానంలో వేతనాలు చెల్లిస్తామన్నారు. నెలరోజుల్లో ఈ మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. దూపధీపనైవేద్య కింద ఇప్పటి వరకు 1805 ఆలయాలకు నెలకు ఇస్తున్న 2500 రూపాయలను ఆరువేల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. మరో 3000 ఆలయాలకు దీన్ని వర్తింపచేస్తామని మంత్రి ఇంక్రదరణ్‌రెడ్డి వెల్లడించారు.
‘ఆప్’ సమర భేరీకీ ‘నో’
హైదరాబాద్, ఆగస్టు 13: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ నెల 16న నిర్వహించాలనుకున్న ‘సామాన్యుల సమర భేరీ’ సభకూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ‘ఆప్’ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాముగౌడ్, నసీమ్ బేగం, ఎంఎం హుస్సేన్ తదితరులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో సమావేశం కావాలనుకున్నారు. కానీ శాంతి-్భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. కాగా ఇదే సమయంలో ఆప్ కూడా హిమాయత్‌నగర్ లిబర్టీ సమీపంలోని ఎవి కళాశాల మైదానంలో ‘సామాన్యుల సమర భేరీ’ సభకు అనుమతించాల్సిందిగా పోలీసులను కోరింది. ఒకవైపు రాహుల్‌ను ఉస్మానియా వర్సిటీకి వెళ్ళకుండా కట్టడి చేసి, ఇప్పుడు ఆప్ సభకు అనుమతి ఇస్తే విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాము గౌడ్ నేతృత్వంలో ఆప్ కోర్ కమిటీ సభ్యులు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో 16న సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.