తెలంగాణ

ఏసీబీ వలలో వైద్యాధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 14: పేద, మధ్య తరగతి వర్గాలకు నుంచి కాదు.. ఏకంగా వైద్యుల నుంచే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ ప్రతాప్‌కుమార్ కథనం మేరకు డాక్టర్ కే.హైమావతి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజీస్టుగా పని చేస్తున్నారు. ఆమె ఉద్యోగ ఒప్పందం ఈ యేడాది మే 24వ తేదీతో తీరిపోయింది. దాన్ని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కూడా హైమావతి ఉద్యోగ ఒప్పందాన్ని పొడిగించడానికి అంగీకరించారు. వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ద్వారా ఉత్తర్వులు పొం దాల్సి ఉంది. ఈ మేరకు సంగారెడ్డి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురారిని సంప్రదించగా నెల జీతం లక్ష రూపాయలను లంచంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హైమా వతి భర్త డాక్టర్ శ్రీ్ధర్‌కుమార్ కూడా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. దీంతో శ్రీ్ధర్‌కుమార్ ఈనెల 10వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మొత్తానికి 80 వేలకు మురారీ అంగీకరించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం సూపరింటెండెంట్‌ను కలిసి డబ్బులు చెల్లిస్తామనగా, కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌గౌడ్‌కు ఇవ్వాలని సూచించారు. డబ్బులు చేతికి అందిన వెంటనే ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ నరేందర్ గౌడ్, సూపరింటెండెంట్ మురారిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.