తెలంగాణ

ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రజల్లో తన పలుకుబడి తగ్గుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెలుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ముగ్దంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వమపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలన్నింటితోకలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించ్చుతామని హెచ్చరించారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తుందన్నారు. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేక పోయారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను గాలికొదిలిన ముఖ్యమంత్రి గొర్రెలు, బర్రెలు చేపలు పంపిణీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు వినని సంస్కారం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని మండిపడ్డారు. పోలీసులు కేసీఆర్‌ను పెద్ద కొడుకులా భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇతర పార్టీ నేతలను బెదిరంచి అధికార పార్టీలో చేరేలా ఒత్తిడి తెస్తున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసి కుటిల రాజకీయాలకు తెరలేపిన కేసీఆర్‌ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదంతో రాష్ట్రంలో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల అన్నింటితో కలిపి నిరంకుశ, నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని పేర్కొన్నారు.

ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్న కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 14: కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సాలర్‌జంగ్ మ్యూజియంలో ‘నవభారతం నిర్మించి తీరుతాం’ పేరుతో సామచార ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందని అన్నారు.