తెలంగాణ

పీజీఈసెట్ తుది విడత సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలోని పీజీ టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ అడ్మిషన్ల తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ సమీనా ఫాతిమా తెలిపారు. తొలి దశలో ఎంటెక్‌లో 5815, ఎంఆర్చ్‌లో 82, ఎం ఫార్మసీలో 3012 సీట్లు ఉండగా, 10,623 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేశారని, వారిలో 6619 మందికి సీట్లు కేటాయించగా 4125 మంది కాలేజీల్లో చేరారని ఆమె చెప్పారు. ఇక రెండో దశలో 4842 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా, 6861 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారని, వారిలో 2806 మందికి ఎంటెక్, 66 మందికి ఎం ఆర్చ్, 900 మందికి ఎం ఫార్మసీ సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. వీరంతడా 18వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆమె సూచించారు.
ఇదిలా ఉండగా, ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎన్ నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరం మొదటి రెండు నెలల కాలంలోనే 14 ఘటనలు జరిగాయని, ముషీరాబాద్‌లోని ఒక స్కూలులో వేధింపులు భరించలేక మహేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, హిమాయత్‌నగర్‌లోని మరో స్కూలులో జడ సరిగా వేసుకోలేదని అవమానించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని, అంబర్‌పేటలోని ఒక స్కూలులో టీచర్ స్టూడెంట్‌ను లైంగికంగా వేధించాడని, సికింద్రాబాద్‌లోని మరో హైస్కూల్‌లో పురుష పీఈటీ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఇలా ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితి నియంత్రించమని విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్యకు వినతిపత్రం ఇచ్చామని నారాయణ తెలిపారు.
టీపీఏ సూచనల మేరకు అదే రోజు ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు డైరెక్టర్‌ను స్పెషల్ సీఎస్ ఆదేశించారని, అయినా వారం రోజులు గడిచినా అధికారులు మాత్రం స్పందించలేదని ఆరోపించారు.
అవార్డులకు మార్గదర్శకాలు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన అవార్డులను బహుకరించేందుకు వీలుగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా , డైట్ ప్రిన్సిపాల్, మరో అధికారి సభ్యుడిగా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో స్పెషల్ సీఎస్ చైర్మన్‌గానూ, పాఠశాల విద్య డైరెక్టర్, ఎస్‌సిఈఆర్‌టీ డైరెక్టర్, టిఆర్‌ఇఐఎస్ కార్యదర్శి, ఐఎఎస్‌ఈ ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీ ఎంపిక చేస్తుంది. 10 మంది గెజిటెడ్ హెచ్‌ఎంలు, 31 మంది స్కూల్ అసిస్టెంట్‌లు, ఇద్దరు లెక్చరర్లను ఎంపిక చేస్తారు.