తెలంగాణ

సింగరేణిపై గీతాల ఆడియో సీడీ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14:సింగరేణిలో పని చేస్తున్న కార్మికులను ఉత్తేజపర్చడానికి, సంస్థ లక్ష్యాలను పెంపొందించడానికి చేపట్టిన గీతాల ఆడియో సిడిని సంస్థ అధికారులు ఆవిష్కరించారు. మంగళవారం సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కదలిరండి, కదలిరండి అంటూ గీతాలతోకూడిన సిడిలను విడుదల చేశారు. బుధవారం నాడు సింగరేణి అన్ని ఏరియాల్లో పంద్రాగస్టు వేడుకల్లో సిడిల గీతాలను వినిపించనున్నారు. సింగరేణిలో చేపట్టిన సామాజిక సేవలతో పాటు కార్మికుల ఆరోగ్యం కోసం సంస్థ చేపడుతున్న అంశాలను సిడిలలో పొందుపర్చారు. కార్యక్రమంలో డిజిఎం రమేష్‌బాబు, పిఎం సత్యనారాయణ, ఎఎండి దుండె వెంకటేశం,ఎఫ్‌ఎం అరవింద్, పిఆర్‌ఒ బి, మహేష్, సినీ దర్శకులు కంది రామచంద్రారెడ్డి,సంగీత దర్శకుడు వెంకట్, గణాశంకర్ పూజారి తదితరులు పాల్గొన్నారు.