తెలంగాణ

కేంద్ర పథకాల అమలులో రాష్ట్రం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: కేంద్ర పథకాలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఆరోగ్య భారతం కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా పేదలకు వైద్యం అందుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 10 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం మసకబారుతున్న సమయంలో కేంద్రం ప్రకటించిన ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కనీసం ఈ పథకాన్ని అయినా రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా అమలుచేయాలని సూచించారు. పైగా కేంద్రం తమకు సహకరించడం లేదని సీఎం విమర్శించడాన్ని కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. రాహుల్ గాంధీపైన కూడా ఆయన విమర్శలు సంధించారు. పార్లమెంటులో రాహుల్ వ్యవహరించిన తీరువల్ల ఇప్పటికే ఆయన ప్రతిష్ట మసకబారిందని అన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్ర మే కాంగ్రెస్ అధికారంలో ఉందని, దేశంలో ఆ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కేంద్రం మరింత పకడ్బందీగా రూపొందించిందని, ఓబీసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ బలహీనవర్గాల అభిమానం చూరగొందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఇపుడు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఎస్ ప్రకాశ్‌రెడ్డి, ఛాయాదేవి, శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.