తెలంగాణ

లబ్ధిదారులకే నేరుగా పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా, మధ్య దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ‘మహా భారతంలో ధర్మరాజు గురించి విన్నాం. కానీ కలియుగ ధర్మరాజు ముఖ్యమంత్రి కేసీఆర్’ అని మంత్రి తలసాని బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. నాటి ధర్మరాజు తరహాలో కేసీఆర్ ఎవరు ఏది కోరినా వెంటనే ఇచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. చాలామంది నేతలు బీసీలకు తామే చాంపియన్లమంటూ కాలర్ ఎగుర వేస్తున్నారని, నిజానికి అసలైన చాంపియన్ కేసీఆరేనని అన్నారు.
ఏ పథకమైనా బ్యాంకులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే అమలు చేస్తున్నదని, లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా, మధ్య దళారులను ఆశ్రయించి మోసపోకుండా చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మత్స్యకారులకు ఈ ఏడాది 80 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయబోతున్నామని, ఇంకా రూ.1100 కోట్ల రూపాయలతో వారికి అవసరమైన వస్తువులు ఖరీదు చేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా గొల్ల, కురుమల కోసం లోగడ 64 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తే, వాటికి 35 లక్షల పిల్లలు అయ్యాయని అన్నారు. గొల్ల కురుమల కోసం 5 వేల కోట్లు ఖర్చు చేశామని, రాబోయే రోజుల్లో 7 వేల నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. గంగపుత్ర, తెనుగు, ముదిరాజు, గోండ్లు, రజకులు, నారుూ బ్రాహ్మణులు ఆర్థికంగా బలపడేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం దేశానికే ఆదర్శవంతమైందని ఆయన తెలిపారు. 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10 లక్షల మంది బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొనని ‘కంటి వెలుగు’ పథకం చారిత్రాత్మకం అవుతుందని ఆయన తెలిపారు.