తెలంగాణ

ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ ఆహ్లాదకరంగా కొనసాగింది. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు గంటసేపు కొనసాగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం వేళ ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. ఇదే రోజు సాయంత్రం గవర్నర్ ‘ఎట్‌హోం’ పేరుతో రాజ్‌భవన్‌లో ముఖ్యులందరినీ ఆహ్వానించి తేనీటి విందు ఏర్పాటు చేస్తారు. నరసింహన్ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉండటం వల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, ఉభయ రాష్ట్రాలకు చెందిన ముఖ్యులందరినీ ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయనేతలతో పాటు, అధికారులు, వీఐపీలు కలిసి సరదాగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఎట్‌హోంలో గడుపుతారు. బుధవారం జరిగిన ఎట్‌హోంలో తొలుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఆ తర్వాత తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌తో పాటు ఆయన భార్య విమల రాజ్‌భవన్ లాన్స్ ప్రాంగణమంతా కలియ తిరిగారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు కే. జానారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్‌సభ్యుడు సుజనాచౌదరి, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. భారత రక్షణ శాఖలో త్రివిద దళాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రాల్లో ఏర్పాటైన ప్రధాన కార్యక్రమాల్లో పతాకావిష్కరణకు ఉభయ రాష్ట్రాల మంత్రులంతా వెళ్లడం వల్ల చాలా మంది మంత్రులు ఎట్‌హోంకు రాలేకపోయారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్‌సభ్యులు కే. కేశవరావు, డి. శ్రీనివాస్, వినోద్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌స్ ప్రభాకర్, సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విద్వత్‌సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, మరుమాముల వేంకటరమణ శర్మ తదితరులు గవర్నర్‌ను ఈ సందర్భంగా కలిసి శ్రీవికారి నామ సంవత్సరానికి జ్యోతిష మహాసభల్లో రూపొందించిన పండల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు.