తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 14: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మనగూడ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో 23 మందికి తీవ్ర గాయాలు కాగా, ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన 26 మంది టాటాఏస్ వాహనంలో చేర్యాల మండలం నాగపురిలో బందువులు ఒకరు మృతి చెందగా అంత్యక్రియలకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మద్యమైన గజ్వేల్ మండలం రిమ్మనగూడ శివారులోకి రాగానే అక్కడే ఉన్న వారి బంధువును ఎక్కించుకునేందుకు రోడ్డు పక్కన టాటాఏస్ వాహనం (ఏపీ28టీఈ7387) నిలిపారు. అదే సమయంలో అతి వేగంగా వస్తున్న లారీ (ఏపీ15బీ9129) టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో అది పల్టీలుకొట్టి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెల్లింది. దీంతో టాటాఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న అక్కారం కిష్టయ్య (60), అక్కారం పోచయ్య (35), అక్కారం సాయమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కారం రాములు, ఎమిడాల నర్సయ్య, శరదనొల్ల కొమురవెల్లి, శరదనొల్ల బిక్షపతి, అక్కారం యాదయ్య, శరదనొల్ల రాములు, శరదనొల్ల యాదయ్య, శరదనొల్ల పెదపోచయ్య, శరదనొల్ల పెద్ద స్వామి, అక్కారం మల్లయ్య, అక్కారం బాగ్యమ్మ, అక్కారం అంజయ్య, బుడ్డోల్ల పోచయ్య, డబిల్‌పురం నర్సయ్య, మునిగడప ఐలమ్మ, చిగురిపల్ల చంద్రమ్మ, అక్కారం ఎల్లమ్మ, అక్కారం నర్సమ్మ, అక్కారం అనసూయ, అక్కారం చంద్రయ్య, ఉల్లి మల్లయ్య, అక్కారం సుగుణ, కర్రోల్ల బాల్‌నర్సయ్యలకు తీవ్ర గాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐలు మదుసూదన్‌రెడ్డి, ప్రసాద్ తీవ్రంగా గాయపడిన 23 మందిని గజ్వేల్ ఆసుపత్రికి, తరువాత నిమ్స్‌కు తరలించారు.
అలాగే రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా, సమాచారం అందుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాంతిభద్రతల డీసీపీ నర్సింహారెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డిలు గజ్వేల్ చేరుకొని బాదితులను ఓదార్చారు. ఈ సందర్బంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రిమ్మనగూడ రోడ్డు ప్రమాద సంఘటన దురదృష్టకరమని, అలాగే బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.