తెలంగాణ

నిజాం తరహాలో కేసీఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,సెప్టెంబర్ 15: తెలంగాణలో ఆనాటి నిజాం తరహాలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, నాటి సంఘటనలకు నేడు గుర్తు చేసుకోవాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ విముక్తి కోసం పోరాడితే నేడు కేసీఆర్ పాలనను అంతంచేయడానకి ప్రజలు సమాయత్తం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని తెలంగాణ జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఆయన సూచించారు. కెసీఆర్ రాచరిక పాలన అంతానికి ముందస్తు ఎన్నికలు శుభం పలుకుతున్నాయని ఆయన జ్యోష్యం చెప్పారు. నిజాం బానిస సంకెళ్ళ విముక్తి కోసం ఆనాడు ఎర్రజెండా అండన పోరాడిన సంఘటనలు గుర్తు తెస్తున్నాయన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీర తెలంగాణలో ఫాసిస్టు రాచరిక పాలన సాగుతోందన్నారు.

బాబుకు అరెస్టు వారెంట్ కక్ష సాధింపే
ఏపీ అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు
హైదరాబాద్, సెప్టెంబర్ 15: చంద్రబాబునాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేయడం కక్ష సాధింపు చర్యేనని ఏపీ ప్రణాళిక అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షుడు సీ కుటుంబరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎపుడో 2010లో జరిగిన కేసును ఇపుడు తిరగదోయడం ఏమిటని నిలదీశారు.
చంద్రబాబునాయుడుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం వచ్చిందనే అక్కసుతోనే బీజేపీ ఈవిధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, డీజిల్ రేట్లు పెరిగినా బీజేపీ నాయకులు ఏమీ మాట్లాడటం లేదని, మరో వైపు రూపాయి క్షీణించిందని చెప్పారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి చేతులెత్తేశారని, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇండియాటుడే బూటకపు సర్వేలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు 43 శాతం, చంద్రబాబుకు 38 శాతం ప్రజా మద్దతు ఉందని వెల్లడించడం ఎంత వరకూ నిజమని నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి సర్వేలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ తగ్గిపోతోందని భావించి లాంటి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌రెడ్డి వేరొక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీపై తెలంగాణ మంత్రులు, నాయకులు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.