తెలంగాణ

నైపుణ్యం ఎంతో అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: కేవలం చదువులకే పరిమితం కాకుండా, ప్రాయోగిక శిక్షణకు విద్యాసంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చదువుతో పాటు వృత్తి నైపుణ్యం, వికాసం చాలా అవసరమని ఐటీ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో వృత్తి ,సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో పారిశ్రామిక ఔత్సాహికతను పెంపొందించేందుకు చేపట్టిన స్టార్టప్ ఇండియా యాత్రను ఐటీ మంత్రి కే తారకరామారావు శనివారం నాడు ప్రారంభించారు. ఈ యాత్ర 17న మహబూబ్‌నగర్, 19న నల్గొండ, 20న ఖమ్మం, 21న వరంగల్, 24న కరీంనగర్, 25న జగిత్యాల, 27న ఆదిలాబాద్, 28న నిర్మల్, 29న నిజామాబాద్ మీదుగా అక్టోబర్ 1న సంగారెడ్డి చేరుకోనుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ, ఐఎస్‌బీ మాజీ డీన్ అజిత్ రంగేకర్, బ్రిగేడియర్ పి గణేషం, పల్లె సృజనతో పాటు ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సీఐఓ ఫణీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. వినూత్న ప్రయోగాల పేరిట జరిగిన సదస్సులో వీరు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జర్మనీ తరహాలో ప్రాక్టీస్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, చదువు పూర్తి చేసి డిగ్రీతో బయటకు వచ్చే సరికే వారు నేరుగా పరిశ్రమలో పనిచేసుకునే నైపుణ్యం, కౌశలాలు వారికి అందించినపుడే నిరుద్యోగికత ఉండదని వారు పేర్కొన్నారు.