తెలంగాణ

నాన్నకు శిక్ష పడే వరకూ పోరాటం: అమృత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 16: తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్య చేయించిన తన తండ్రి మారుతిరావు నా ముందుకు వస్తే నేనే చంపేస్తానని మృతుని భార్య అమృతవర్షిణి అన్నారు. ఆదివారం తన భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. శుక్రవారం తన చేయిపట్టుకోని హస్పిటల్ నుండి బయటకి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రణయ్‌పై కత్తితో దాడి చేసింది చూశాను కాని ఆ తరువాత ప్రణయ్‌కి ఏమైందన్న విషయం తనకు తెలియదని తాను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని అన్నారు. మా నాన్న మారుతిరావు, బాబాయ్ శ్రావణ్‌లు సైకోలని, కాని ప్రణయ్‌ను ప్రేమించాను అన్న విషయం తెలిసిన దగ్గరి నుండి గృహనిర్బంధం చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తానని అమృత పేర్కొంది. ప్రేమవివాహం చేసుకున్న మమ్మల్ని విడదీసేందుకు మా నాన్న ప్రయత్నించారని కాని నేను వినలేదన్నారు. నేను గర్భవతి అన్న విషయం తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని తొలుత తండ్రి మారుతిరావు అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు హైకోర్టు అడ్వకేట్, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ ఒత్తిడి చేశారని అంతే కాకుండా డాక్టర్‌ని కూడ అబార్షన్ చేయాలని ఒత్తిడి చేయగా డాక్టర్ వినలేదన్నారు. మా నాన్న మారుతిరావు రెండుసార్లు ప్రణయ్‌ను చంపేందుకు ప్లాన్ చేశారని అది గుర్తించి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించామని, తామ ఇరువురం మంచి భవిష్యత్ కోసం రూపకల్పన చేసుకున్నామని ఇంతలోనే ప్రణయ్‌ను హత్య చేశారని బోరున విలపించింది. తాను నాకు పుట్టబోయే బిడ్డను నేనే పెంచుకుంటానని పుట్టింటికి వెళ్లనని, నాకు నా బిడ్డకు పోలీసులు రక్షణ కల్పించాలని అన్నారు. ప్రణయ్ మళ్లీ జన్మిస్తాడన్న నమ్మకం నాకుందని ఆమె తెలిపింది. కులరహిత సమాజం కోసం పోరాడుతానని ఆమె పేర్కొన్నది.