తెలంగాణ

మంత్రిగారూ ఏమిటిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెరాస ప్రచారంలో చుక్కెదురైంది. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం మార్చాల గ్రామంలో కల్వకుర్తి తెరాస అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రచారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా మార్చల గ్రామంలో ప్రచార సభను నిర్వహించారు. వివిధ పార్టీలకు సంబందించిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంలోనే మార్చల గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు తెరాస కార్యకర్త దున్న రామంజనేయులు ఒక్కసారిగా మంత్రి దగ్గరకు వెళ్లి వాగ్వీవాదానికి దిగారు. తాము తెలంగాణ కోసం ఉద్యమం చేశామని ఉద్యమకారులకు సినియర్ కార్యకర్తలకు పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా కల్వకుర్తి నియోజకవర్గంలో నాయకులు ఎవరైనా కార్యకర్తలను పట్టించుకున్న పాపన పోయ్యారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు. తాను మొదటి నుండి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తనలాంటి వారికి ఏమి న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని తమ గ్రామంలో యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే తాము ఎలా సమాదానం చెప్పాలో అర్థం కావడంలేదంటూ మంత్రి దగ్గర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్త రామంజనేయులును సముదాయిస్తుంటే ఇంకా ఎక్కువగా మాట్లాడుతుండడంతో మంత్రికి కోసం వచ్చింది. ఎవరెన్ని కుట్రలు చేసిన భయపడేదు లేదని మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఈ సమయంలోనే పోలీసులు రంగంలోని దిగి మంత్రితో వాగ్వీవాదానికి దిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తను పక్కకు తీసుకెళ్లడంతో ప్రచార పర్వం సజావుగా కొనసాగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా గుబాలించడం ఖాయమని ఇది ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. ఒకరిద్దరు ఇలాంటి వ్యవహరాలు చేస్తుంటారని అలాంటి వారిని పట్టించుకోవద్దని సూచించారు.