తెలంగాణ

అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 19: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులపై నియోజకవర్గాల్లో ఎదురవుతున్న అసమ్మతి సద్ధుమణుగకపోగా అసమ్మతివాదులు భారీ ర్యాలీలు, పోటీ సభలతో రెబెల్‌గా బరిలోకి దిగుతామని ప్రకటిస్తూ.. అభ్యర్థులను మార్చాలంటూ అధిష్ఠానానికి ఆల్టిమేటంలతో దూసుకెళ్తున్నారు. కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన కోదాడ నియోజకవర్గం టికెట్‌ను నియోజకర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెనెపల్లి చందర్‌రావులు ఆశిస్తుండగా ఇక్కడ చందర్‌రావు వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లుగా గులాబీ వర్గాల కధనం. అయితే హుజూర్‌నగర్‌లో మాత్రం నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మకు కాకుండా ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, కేసీఆర్, కేటిఆర్‌లు బుధవారం సైదిరెడ్డిని హైద్రాబాద్ పిలిపించి ఈ మేరకు చర్చలు జరిపారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో బుధవారం శంకరమ్మ తన మద్ధతుదారులతో హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించి తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటు టిఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని హెచ్చరించింది. మంత్రి జగదీష్‌రెడ్డినే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నాడంటు ఆరోపించింది.
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల టికెట్ల పంచాయతీ అలావుంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల నరసింహయ్యపై అసమ్మతినేతలు ఎం.సి.కోటిరెడ్డి తిరుగుబాటు రోజురోజుకు ఉదృతం చేస్తు సహాయ నిరాకరణ ప్రకటించి అభ్యర్ధిని మార్చాల్సిందేనంటు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. నోముల నరసింహయ్య స్థానికుడు కాదని, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిని ఓడించాలంటే నోములను మార్చాల్సిందేనని, తనకు లేదా నియోజకవర్గానికి చెందిన మరెవరికైనా టికెట్ ఇస్తే జానారెడ్డిని ఓడిస్తామంటు కోటిరెడ్డి అధిష్ఠానం వద్ధ డిమాండ్ పెట్టారు. నోముల టికెట్ రద్ధు కోరుతు మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్లు, మండల పార్టీల అధ్యక్షులంతా తమవెంటే ఉన్నారంటు కోటిరెడ్డి తన మద్ధతుదారుల సంతకాలతో కేసీఆర్‌కు తీర్మానం పంపించారు. దీంతో సాగర్ నియోజకవర్గంలో నోముల అభ్యర్ధిత్వాన్ని కొనసాగించే విషయమై టీఆర్‌ఎస్ అధిష్ఠానం అంతర్మధనం సాగిస్తుంది. అటు నల్లగొండలో సైతం టీఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యిర్ధిత్వాన్ని మార్చాలంటు మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు దుబ్బాక నరసంహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌లు పోటీసభలు, ప్రచారాలతో అధిష్ఠానాన్ని పరేషన్ చేస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ చకిలంను పిలిపించి కంచర్లకు సహకరించాలని నచ్చచెప్పగా చకిలం ససెమిరా అంటు ఇప్పటికే మూడు ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వక అన్యాయం చేశారంటు ఈ దఫా ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటు తెగేసి చెప్పడం చర్చనీయాంశంమైంది. ఇదే రీతిలో దుబ్బాక సైతం కంచర్ల అభ్యర్ధిత్వాన్ని మార్చకపోతే అతని ఓటమి ఖాయమంటు అధిష్ఠానాన్ని హెచ్చరించారు. కేటీఆర్‌తో పాటు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి వాదులను బుజ్జగించనున్నారని తెలుస్తుంది. తుంగతుర్తిలో గాదరి కిషోర్ అభ్యర్ధిత్వంపై మందుల సామేల్, మునుగోడులో కూసుకుంట్లకు వ్యతిరేకంగా వేనెపల్లి వెంకటేశ్వర్‌రావు, పల్లె రవిలు తమ అసమ్మతి కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఈనెల 21న చండూర్‌లో వెనెపల్లి అసమ్మతి వాదుల సభ నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఎన్.్భస్కర్‌రావు అభ్యర్ధిత్వం మార్పుపై టిఆర్‌ఎస్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుండి కె.జానారెడ్డి పోటీకి సిద్ధపడుతున్నందునా భాస్కర్‌రావు పోటీకి విముఖత చూపుతున్నారని, జానారెడ్డిపై పోటీకి ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిని బరిలోకి దింపనున్నారన్న ప్రచారం సాగుతుంది. ఓడినా, గెలిచినా గుత్తాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీతో కేసీఆర్ మిర్యాలగూడ నుండి గుత్తాను రంగంలోకి దింపేందుకు నిర్ణయించారని తెలుస్తుంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అసమ్మతివాదులను ఏకం చేస్తు స్థానికులకే టికెట్ ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటు ఒత్తిడి పెంచుతున్నారు. ఆలేరు అభ్యర్ధి గొంగిడి సునీతపై ద్వితీయ శ్రేణి నాయకత్వం వ్యతిరేకత వెళ్లగక్కుతుంది. దేవరకొండ టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఆర్.రవీంద్రకుమార్‌కు జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్, లాలునాయక్‌లు సహాయ నిరాకరణ సాగిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో తుదిక్షణాల్లో మార్పులు తప్పవన్న ప్రచారం ప్రస్తుతం గులాబీ వర్గాల్లో షికార్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.