తెలంగాణ

కేంద్రం మెడలు వంచాం.. తెలంగాణ సాధించుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని.. కేసీఆర్ ఆమరణ దీక్ష.. ప్రజలు పోరాటంతో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటేనే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇస్తేనే మాకు సీట్లు, అధికారం దక్కుతుందని.. ప్రజల ఆకాంక్షను గుర్తించలేదని, అధికార వ్యాపకంపై కాంగ్రెస్ నేత ఆజాద్ చెప్పకనే చెప్పారన్నారు. పదవులు, సీట్లపై ఉన్న ఆకాంక్ష.. ప్రజలపై లేదని స్పష్టం చేశారన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌లో శుక్రవారం మంత్రి హరీష్‌రావును జోరు వానలో అశ్వరథంపై ఊరేగించారు. ఊరంత బతుకమ్మ, బోనాలు, డప్పు విన్యాసాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి హరీష్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్థులు తీర్మాన పత్రాన్ని మంత్రి హరీష్‌రావుకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే 1969లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేవారన్నారు. 369 మంది విద్యార్థులు కాల్చిచంపారన్నారు. తెలంగాణ ప్రజాసమితిపై పక్షాన విజయం సాధించిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండ మోసం చేశారని విమర్శించారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ వస్తే అప్పటి కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన చేసారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన వెనుక్కి తీసుకుంటే వందలాది మంది బలిదానాలు చేసారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ వచ్చి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ చెప్పాడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్పించిన రాష్ట్రం ఇవ్వకుండ మోసం చేశారన్నారు.
చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్న తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు పొత్తు ఎలా పెట్టుకుంటారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు చెపుతున్నారని, ఏపీకి హోదా ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ పరిశ్రమలు తరలివెళ్లితే ఇక్కడ యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంట్ విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని తెలంగాణ విషయంలో రాహుల్‌గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు ప్రశ్నంచటం లేదన్నారు. తెలంగాణ పరిశ్రమల రాయితీపై ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తు..ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఓట్లు వేసి గెలిపించాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రాబాబు, చంద్రబాము కాళ్ల ముందు తాకట్టు పెడుతారని ఆరోపించారు. వానకాలం ఉసిర్లు వచ్చినట్లు..ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో కన్పిస్తారని, మళ్లీ కనపడరని ఎద్దేవా చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి గోదావరి నీటితో కాల్వల ద్వారా తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్న టీఆర్‌ఎస్ పార్టీనే మళ్లీ ఆదరించాలని ప్రజలను ఆకాంక్షించారు.