తెలంగాణ

బహుజన లెఫ్ట్‌ప్రంట్ సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను ఎన్నికల బరిలోకి దించుతామని ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభ్రదం వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పటిది కాదని బీఎల్‌ఎఫ్ ఏర్పాటు చేసిన మరుసటి రోజునే నాయకత్వం వహించాల్సిందిగా కృష్ణయ్యను కోరినట్టు ఆయన తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునేది కృష్ణయ్య చేతిలోనే ఉందని వీరభద్రం అన్నారు. ఇలా ఉండగా తెలంగాణలో ఉన్న 112 బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. బీసీ సంఘాలన్నీ ఆర్ కృష్ణయ్య పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాయి. ఈ మేరకు ఆ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెల 27వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. 2014 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కృష్ణయ్య గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూనే జాతీయ బీసీ కులాల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కులాలకు చెందిన అభ్యర్థులనే బరిలోకి దించుతామని తమ్మినేని చెప్పారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు.
నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమాలుచేస్తే కేసీఆర్ వాటిని సొంతం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో నూటికి 93 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఎంబీసీ, మైనార్టీలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ గణాంకాలతోనే బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని సీపీఎం నేత విమర్శించారు.