క్రైమ్/లీగల్

ముగ్గురు పిల్లలతో కాల్వలోకి దూకిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలియా, అక్టోబర్ 5: కుటుంబ తగాదాల నేపథ్యంలో మహిళ తన ఇద్దరి కుమార్తెలు, కుమారుడుతో కలిసి సాగర్ ఎడమకాల్వలో దూకి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్లగొండ జిల్లా హాలియాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంగోతు మోహన్‌నాయక్ భార్య స్వాతిని నిత్యం తాగి వేధింపులకు గురిచేసేవాడు. శుక్రవారం ఉదయం కూడ స్వాతి భర్త మోహన్‌నాయక్‌ల మధ్య వివాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురై భర్త వేధింపులను తాళలేక స్థానిక పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమార్తెలు సాత్విక (7), మిధునశ్రీ (5), కుమారుడు మమంత్‌నాయక్ (5) టిఫిన్ చేయిస్తానని స్కూల్ నుంచి బయటికి తీసుకువచ్చింది. అనంతరం స్వాతి ముగ్గురి పిల్లలతో సహా శుక్రవారం ఉదయం పదిగంటల సమయంలో హాలియా వద్ద గల సాగర్ ఎడమకాల్వ వద్దకు ఆత్మహత్య చేసుకునేందుకు గాను చేరుకుంది. అక్కడ కొద్దిసేపు తచ్చాడిన ఆమె కాల్వ కట్టపై ముగ్గురు పిల్లలను నిలబెట్టింది. ఆ తరువాత స్వాతి తమ పిల్లలు సాత్విక, మిధునశ్రీ, మమంత్‌లను ఎడమకాల్వలోకి నెట్టి వెంటనే తను కూడ దూకింది. అదే సమయంలో కాల్వలపై నిలిచి ఉన్న యువకుడు కొట్టుకపోతున్న వారిని చూసి పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌లో తెలియజేశాడు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైటర్ మహ్మద్ జహీర్, హోంగార్డు మునినాయక్‌తో పాటు పని నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన స్థానిక ఎంపిటిసి చెరుపల్లి ముత్యాలు హుటాహుటిన సాగర్ ఎడమకాల్వ వద్దకు చేరుకున్నారు. స్థానిక దర్గా వద్ద కాల్వ కట్టపై చిన్నారులు విడిచిన చెప్పులను చూసి ముందుకు వెళ్లారు. కాల్వ ప్రవాహంలో కొట్టుకుపోతున్న స్వాతిని చూసి జహీర్, మునినాయక్, ముత్యాలు కాల్వలోకి దూకి అతి కష్టం మీద స్వాతిని బయటికి తీశారు. అదే ప్రవాహంలో కిందికి కొట్టుకపోతున్న చిన్నారులు సాత్విక, మిధునశ్రీలను బయటికి తీశారు. కాని కుమారుడు మమంత్‌నాయక్ నీటిప్రవాహంలో గల్లంతు అయ్యాడు. అతని ఆచూకి కోసం పోలీసులు గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒడ్డుకు తీసిన తల్లి, కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో హాలియా ఎస్‌ఐ బి.సతీష్ తమ పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికు తీసుకొస్తుండగా మార్గ మధ్యలో చిన్నారులు సాత్విక, మిధునశ్రీలు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న స్వాతిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి అనంతరం మెరుగైన చికిత్స కొరకు నల్లగొండ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఎంతో సాహసంగా తల్లి, పిల్లలను కాపాడే ప్రయత్నం చేసిన స్థ్ధానిక ఎంపీటీసీ ముత్యాలు, పోలీస్ సిబ్బంది జహీర్, మునినాయక్‌లను పలువురు అభినందించారు.

పోలీస్ ఉద్యోగం రాదన్న ఆందోళనతో యువకుడి ఆత్మహత్య
పెద్దకొత్తపల్లి, అక్టోబర్ 5: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పోలీస్ ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన కీ చూసుకున్న ఓ నిరుద్యోగి, మార్కులు తక్కువగా వస్తున్నాయని, ఇక పోలీస్ ఉద్యోగం రాదని నిర్ణయించుకొని తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని దేదినేనిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. దేదినేనిపల్లికి చెందిన మాగిని లోకేష్ (21) డిగ్రీ వరకు చదువుకొని పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని గత ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. పరీక్ష మంచిగా రాశానని, ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉండి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పుకుంటూ వచ్చిన లోకేష్ శుక్రవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్షకు సంబందించిన కీని విడుదల చేయడంతో దానిని చూసుకొని తన అంచనాలకంటే తక్కువ మార్కులు రావడంతో లోకేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ మార్కులతో తాను ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించలేనని, ఇక పోలీస్ ఉద్యోగం రాదనే నిర్ణయించుకొని తన సొంత వ్యవసాయ పొలం వద్దకు చేరుకొని గుళికల మందు తాగాడు. దీనిని చూసిన చుట్టుపక్కల పొలాల రైతులు వెంటనే తండ్రి చిన్న వెంకటయ్యకు, పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై నరేష్ హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ వాహనంలోనే లోకేష్‌ను నాగర్‌కర్నూల్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లోకేష్ మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన లేఖలో తన మృతికి ఎవ్వరుకారణం కాదని, నాకు పోలీస్ ఉద్యోగం వస్తే నా తల్లిదండ్రులను, అన్న, వదినలను పోషించాలనుకున్నా, కాని పోలీస్ ఉద్యోగం రాదన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మృతుని తండ్రి చిన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ ఘటనతో దేదినేనిపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి.