తెలంగాణ

సోమశిల సోయగం అపూర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, అక్టోబర్ 9: ప్రకృతిలో సోమశిల అందాలు భవిష్యత్‌లో పాపికొండలకు మించిపోతాయని ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం నాగర్‌క ర్నూల్ జిల్లా పరిధిలో కొల్లాపూర్ సంబరాలు మూడో రోజు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూపల్లి జగన్మోహన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ కొల్లాపూర్ అందాలకు కృష్ణాతీరం వెంట నెలకొన్న ప్రకృతి అందాలతో సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రదేశంగా పేర్కొన్నారు. వీలైతే వచ్చే సంవత్సరం కొల్లాపూర్ ప్రాంతంలో ముఖ్యంగా సోమశిల, సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం, జడప్రోలు మదనగోపాల స్వామి ఆలయం పరిసర ప్రాంతాలలో సినిమా తీస్తానని ప్రకటించారు. శివాజ్ఞలేనిదే చీమనైనా కుట్టదని శివాతత్వాన్ని గురించి తాను రాసిన కొన్ని పద్యాలను చదివి వినిపించారు. ఈ ప్రాంతంలో పుట్టి దేశాలలో, విదేశాలలో విజయాలను సాధించిన వారి జీవితాలను రాసిన పుస్తకాన్ని తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. తాను జీవితంలో ఎక్కడ ఇంద మంది కళాకారులను చూసిన పాపాన పోలేదని, అందరూ గర్వపడేలా సంబరాలను నిర్వహిస్తున్న రత్నగిరి ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గం కాలువల నీటితో భూములు పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన వాతావరణంను కలిగిస్తుందన్నారు. ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాలనుంచి వచ్చిన కళాకారులను ఆమె అభినందించారు.
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాన్ని చూసి మా ప్రాంతం కూడా అభివృద్ధి పర్చాలనే ఆలోచన వస్తుందన్నారు. వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు.