తెలంగాణ

కొలిక్కిరాని ‘కూటమి’ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహాకూటమిగా ఏర్పడినప్పటికీ పొత్తుల చర్చలు తేలడం లేదు. రెండు రోజుల్లో తేల్చేయాలని ప్రతి రోజూ ఇలా అనుకుంటున్నా, కొలిక్కి రావడం లేదు. మాసాబ్ ట్యాంక్‌లోని గోల్కండ హోటల్‌లో మంగళవారం టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభృతులు చర్చలు జరిపారు. ఈ చర్చలకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ దూరంగా ఉండడంతో కూటమి నేతలకు భయం పట్టుకున్నది. దీంతో రమణ చొరవ తీసుకుని ప్రొఫెసర్‌తో చర్చించారు. రెండు రోజుల్లో పొత్తులో భాగంగా తమకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వని పక్షంలో తాము ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకుంటామని ఆయన రమణకు ఖండితంగా చెప్పారు. కాగా బుధవారం మరోసారి జరిపిన చర్చలతో కొంత స్పష్టత వచ్చినట్లు కనిపిస్తున్నది. చర్చలు సానుకూలంగానే జరిగాయని ప్రొఫెసర్ కోదండరామ్ తన అనుచరుల వద్ద అన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోరాదన్న భావనతోనే తాము సంయమనం పాటిస్తున్నామని టీజేఎస్ నేతలు అంటున్నారు. ఇలాఉండగా ఇంకా జాప్యం చేయకుండా ఒకటి, రెండు రోజుల్లో సీట్ల పంపిణీ చేసుకుని, ముందుగా ఆ వివరాలు వెల్లడించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. సీట్లు ఖరారైతే, తర్వాత ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించుకోవడానికి అవకాశం ఉంటుంది.
మరోవైపు కాంగ్రెస్ ఆశావాహులు ఏఐసీసీ నేతలను కలుసుకునేందుకు ఢిల్లీకీ పరుగులు తీస్తున్నారు. తాము ఆశిస్తున్న సీటు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు పోకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పీసీసీకి అనుబంధ విభాగమైన రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, ఏఐసీసీ సేవాదళ్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్ళారు. సేవాదళ్‌కు కనీసం మూడు సీట్లు కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. కనుకుల ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇంకా దేవరకద్ర, నిర్మల్ సీట్లనూ సేవాదళ్ నాయకులకు ఇవ్వాలని కోరుతున్నారు.