తెలంగాణ

జగిత్యాల నుంచే జైత్ర యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......

జగిత్యాల, అక్టోబర్ 11: టీటీడీపీ తెలంగాణ రాష్ట్రఅధ్యక్షుడు ఎలగందుల రమణ, సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డిలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ..జగిత్యాల తాజా, మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో 2006లోడీల్ చేసుకుని సిఎం కీసీఆర్‌పై ఎంపికి పోటీ చేశారని, ఎంపీగా కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. కేసీఆర్ ఓటమి లేని నాయకుడని జీవన్‌రెడ్డి ఎన్ని సార్లు ఓడిపోయారని తెలంగాణలో రాజకీయ అస్తికతకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని పేర్కొన్నా రు. ఎల్.రమణ చద్రబాబుకు బయపడి ఇంటి నుండి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. జీవన్‌రెడ్డి, రమణలు ఓకే వేదికపైకి వచ్చి కుంభమేళాలో విడిపోయి కలిసినట్లు ప్రెస్‌మీట్ పెట్టి అలయ్‌బలయ్ తీసుకుంటే ప్రజలు గమినిస్తున్నారన్నారు. తోడేలు ము సుగు వేసుకుంటే ప్రజలు గమనిస్తున్నారంటూ తెలంగాణ కోసం ఈనాయకులు ఏనాడు పనిచేయలేదన్నారు. జీవన్‌రెడ్డి, రమణలకు కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదా అన్ని అన్నారు. ఆర్‌అండ్‌బి మంత్రిగా ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి తన భూములు చుట్టు రోడ్లు వేసుకుని, భూముల విలువను పెంచుకున్నారని, విద్యార్థులకు అసౌఖర్యంగా ఉంటుందని తెలిసినా జెఎన్‌టియు కళాశాల అక్కడే నిర్మించారన్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో హైదరాబాద్‌లోని మచ్చ బొల్లారం 164 సర్వేనంబర్‌లోని 933 గజాలు చూపుతూ రూ. 17లక్షల విలువ చేసే భూమిగా చూపాడని, 2014లో 8399గజాల భూమిని చూపుతూ 20 లక్షల విలువ గల భూమిగా పేర్కొంటూ అఫడవిట్‌లో చూపించారని, దీనిని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెల్తానని అన్నారు. జగిత్యాల నుండే టీఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని, జతకట్టిన రెండు పార్టీలు ఒక పార్టీ అమరావతి, మరో పార్టీ డిల్లీ నుండి పరిపాలిస్తారని దీనిని ప్రజలు ఆలోచించాలన్నారు. జగిత్యాల మున్సిపాలీటీలో జరుగుతున్నంత అవినీతి ప్రపంచంలో ఎక్కడ లేదని కవిత ఆరోపించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.