తెలంగాణ

కమలం కంచుకోట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. 2001 నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి కొత్తగా అవతరించిన చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజేపీకి కంచుకోట. ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా త్రిముఖ పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీఎస్పీ, మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి ఏర్పాటు చేసిన చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్పీతో పొత్తు విషయమై కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తోంది. దీంతో ఆలస్యం అమృతం విషం అనే చందంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి అజిత్ జోగి పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పొత్తు ప్రకారం బీఎస్పీ 35 సీట్లలో, అజిత్ జోగీ పార్టీ 55 సీట్లలో పోటీ చేస్తుంది. ఈ పార్టీ పొత్తు చివరి దాకా ఉంటుందా, ఒక వేళ కాంగ్రెస్ మనసు మార్చుకుని బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైతే, అజిత్ జోగి పార్టీ పరిస్థితి ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంది.
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనులు 34 శాతం, ఎస్టీలు 12 శాతం, ఇతర బీసీ కులాల జనాభా 50 శాతం ఉన్నాయి. చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఏడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌లో నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎక్కువ. చత్తీస్‌గఢ్ కేంద్రంగా దండకారణ్యం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. మావోయిస్టు పార్టీకి బలమైన పట్టున్న ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 27 జిల్లాలు, 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రం అవతరించిన తర్వాత 2000 నుంచి 2003 వరకు అంటే దాదాపు మూడేళ్ల పాటు అజిత్ జోగి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రం అవతరించిన తర్వాత తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటు చేసింది. 2003 డిసెంబర్ 6వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. బీజేపీ నుంచి రమణ్‌సింగ్ పధ్నాలుగున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి తిరుగులేని బలం ఉన్న రాష్ట్రాల్లో చత్తీస్‌గఢ్ ఒకటి. 2013 ఎన్నికల్లో 90 సీట్లలో 49 సీట్లను బీజేపీ కైవశం చేసుకుని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 39 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బీఎస్పీకి ఒక సీటు వచ్చింది. బీజేపీకి గత ఎన్నికల్లో 41 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 40 శాతం, ఇండిపెండెంట్లకు 15 శాతం ఓట్లు, బీఎస్పీకి 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి, ఓడిన కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 0.75 శాతం మాత్రమే. 90 సీట్లలో పది సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. గత ఎన్నికల్లో ఈ 10 సీట్లలో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ, అజిత్‌జోగి పార్టీపొత్తు వల్ల కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కాని రమణ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ 14 ఏళ్లపైబడి పరిపాలనలో ఉండడం వల్ల ఈసారి మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయం ఉంది. ఇప్పటికే బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సర్కార్ ఎక్కువ కాలం అధికారంలో ఉందనే అభిప్రాయం మినహా ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై అవినీతి అభియోగాలు లేకపోవడం ప్లస్‌పాయింట్. దండకారణ్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అభివృద్ధి మంత్రాన్ని బీజేపీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినట్లే గెలిచి చివరకు ఓటమిచెందింది. ఈ సారి ఎన్నికల్లో గత వైఫల్యాలు పునరావృతం కాకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తున్నా, అజిత్‌సింగ్, బీఎస్పీ పార్టీల కలయిక తమ ఓటు బ్యాంకుకు చిల్లు పెడతాయనే ఆందోళన కాంగ్రెస్‌ను వెంటాడుతోంది.