తెలంగాణ

కలహాలు వద్దు..కలిసి పనిచేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 11: జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో అంతా కలిసికట్టుగా పనిచేసి, పార్టీ ప్రకటించిన అభ్యర్థి తాటికొండ రాజయ్యను గెలిపించుకోవాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని గాని కలహాలు పెంచుకోవద్దని అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసి ముఖ్య మంత్రి కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారని గుర్తు చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయా నియోజకవర్గాలలోని ఆశావహులలో అసంతృప్తి కలిగిందని, దాదాపు 30 నుండి 35 నియోజకవర్గాలల్లో అసంతృప్తి వచ్చిందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్‌లోకి కూడా కొంత మంది అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేశారని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ నుండి టికెట్ కోసం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ఆశపడుతునట్లు కొన్ని కథనాలు కూడా వచ్చాయన్నారు. కాని తాను ఎన్నడు ఆ సీటు కోసం ఆశ పడలేదని, తానే స్వయంగా ఆరు నెలల క్రితమే రాజయ్యకు టికెట్ వస్తుందని చెప్పానని వివరించారు. స్టేషన్ ఘనపూర్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉద్యమ కారులు, రాజయ్యతో వచ్చిన కాంగ్రెస్ నాయకులు, తనతో వచ్చిన టీడీపీ నాయకులు ఉన్నారని అందుకే అందరిని కలుపుకొని పోవాలని రాజయ్యకు సూచించినట్లు వివరించారు. అన్ని గ్రూపులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి పనిచేయాలని, అందరం కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం విభేదించుకుంటే నష్టపోయేది టీఆర్‌ఎసే అని, టీఆర్‌ఎస్ బతుకాలన్నా, కడియం మీద ప్రేమ ఉన్నా, రాజయ్య మీద ప్రేమ ఉన్నా అందరు టీఆర్‌ఎస్ విజయానికి సైనికులవలె పనిచేయాలని కడియం పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు నవ్వే వారిముందు బోక్కబోర్లపడేలా ప్రవర్తించకూడదని, శ్రీహరికి, రాజయ్యకు గౌరవం వచ్చిందంటే టీఆర్‌ఎస్ పార్టీవల్లనేనని అన్నారు. మండల స్ధాయి, గ్రామ స్ధాయి కార్యకర్తలు పాత విషాయాలను దృష్టిలో పెట్టుకుని ఎడమొఖం, పెడమొఖంగా ఉంటే ఫలితాలు మనకు అనుకూలంగా ఉండవని గుర్తు చేశారు. అభ్యర్ధి రాజయ్యకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుండి అహర్నిశలు టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డానని తెలిపారు. గతంలో ఎవైన చిన్నచిన్న పోరపాటు జరిగితే పెద్ద మనుసుతో మన్నించాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిశీలకులు బాలముల్ల, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రాంమోహన్, ఎంపీలు బండా ప్రకాశ్, సీతారాం నాయక్ పాల్గొన్నారు.