తెలంగాణ

గాడ్‌ఫాదరే గొంతు కోసాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 11: రోజు నాలుగు సినిమాల్లో నటిస్తూ హాయిగా జీవిస్తున్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌ను గాడ్ పాదర్‌గా భావించి గౌరవించానని, అదే కేసీఆర్ తన గొంతు కోసాడని సినీ హాస్య నటుడు బాబుమోహన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్ తొలిసారిగా సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 25 సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల మద్యన ఉంటున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీ నుంచి తప్పించే ప్రయత్నం చేసారని ఆరోపించారు. తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌లో అటూ, ఇటూ తిప్పిన కేసీఆర్ నన్ను నడి రోడ్డున వదిలేసాడని ఆక్రోశం వ్యక్తం చేసాడు. నాలుక కోసుకుంటాను, తల నరుకుంటాను అనే కేసీఆర్ దళిత నాయకుల తలలు నరుకుతున్నాడని ధ్వజమెత్తారు. దళితుల పేరు చెప్పి వారికి చేసిందేమి లేదని, బీజేపీ దళితుడిని రాష్టప్రతిని చేసిన గౌరవించిందన్నారు. కేసీఆర్ అవమాన పర్చినా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆహ్వానించడంతో చాలా సంతోషించానన్నారు. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించిన జాబితాలో ఇతరుల పేరును ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ పిలుపు వస్తుందని 25 రోజులు వేచి చూసానని, తండ్రి, కొడుకులకు ఫోన్లు చేసినా, మెస్సేజ్‌లు పెట్టిన జవాబు రాలేదని, దీంతో మరింత క్షోభకు గురైనట్లు తెలిపారు. తన మానసిక క్షోభ ఊరికే పోదని, ఎంతటి వారికైనా సమయం వస్తుందని అన్నారు. చంచాలు, బ్రోకర్లు చెప్పిన మాటలు విని తనను అగౌరపర్చారన్నారు. స్థానికుడికి టికెట్ కేటాయించాలన్న ఆలోచన ఇప్పుడెందుకొచ్చిందని, 2014 ఎన్నికల్లో ఆ పని చేయాల్సింది కదా అని ప్రశ్నించారు. తాను అడగకున్నా ఫోన్ చేసి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. నిర్భయ కేసులో నింధితులను సైతం ధర్మాసనం వదిలి పెట్టిందని, అలాంటిది ఏ తప్పు చేయని తనపై కఠిన శిక్ష ఎందుకు విధించారో కేసీఆర్ సార్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎటు నుండి ఏ రాయి వచ్చినా అది హరీష్‌రావుకే తగులుతుందని అన్నారు. బిడ్డ హరీష్‌రావు వల్లనే టీఆర్‌ఎస్ పార్టీ మనుగడ కొనసాగుతుందని పేర్కొన్నారు. కొడుకు నియోజకవర్గం కోసం సింగూర్ నీటిని అర్ధరాత్రి వదిలిపెట్టించి, పుల్కల్ మండలంలో పొలాలను ఎండబెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. తాను హైదరాబాద్ నుండి సింగూర్‌కు వచ్చే సరికి నీరు నిజామాబాద్ చేరుకుందని ఎమ్మెల్యేగా ఎందుకు ఆపలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాబుమోహన్ జిందాబాద్ అంటూ ప్రజాక్షేత్రంలోకి వెళతానని చెప్పారు. కేసీఆర్ చేసిన అన్యాయమే అస్త్రంగా ప్రజలకు వివరిస్తానన్నారు. బీజేపీలో చేరిన తాను రెండు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీ జాతీయ పార్టీల మద్యనే ఉంటుందని జోష్యం చెప్పారు. కేటీఆర్ వల్లనే తనకు టికెట్ రాకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ పోటీ చేయనున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీ పక్షాన ప్రచారం నిర్వహించి తన సత్తా చాటుతానని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా ఫాం హౌస్, ప్రగతి భవనం చుట్టూ ఉంటుందని, సామాన్యుడినైనా తానేమి చేస్తానన్నారు. విలేఖరుల సమావేశం ముగిస్తూ కంట తడి పెట్టుకున్న బాబుమోహన్‌ను పక్కనే ఉన్న కొడుకు ఉదయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డిలు ఓదార్చారు.